టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.. గత ప్రభుత్వంలో ఓ దినపత్రికపై దాఖలు చేసిన పరువు నష్టం కేసులో టీటీడీ తరఫున లాయర్‌గా మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామిని నియమించింది. అయితే ఈ కేసు నుంచి సుబ్రహ్మణ్యస్వామిని టీటీడీ లాయర్‌గా తొలగించింది. ఈ పరువు నష్టం కేసును టీటీడీ స్టాండింగ్ కౌన్సిల్‌కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకోగా.. తిరుపతి కోర్టులో టీటీడీ తరపున స్టాండింగ్ కౌన్సిల్ జయచంద్ర వకాల్తా దాఖలు చేశారు.
గత ప్రభుత్వ హయాంలో 2019 నవంబరులో టీటీడీ ఆన్‌లైన్ పంచాంగంలో ఏసయ్య అన్న పదం పేర్కొన్నారని ఆ దినపత్రిక ఓ వార్తను ప్రచురించింది. ఆ తర్వాత మరికొన్ని న్యూస్ చానెళ్లు ప్రసారం చేశాయనే వాదనలు ఉన్నాయి. ఈ మేరకు టీటీడీ 2021లో ఆ దినపత్రికపై ఏకంగా రూ. వంద కోట్లకు కోర్టులో పరువు నష్టం దావా వేసింది. ఈ కేసును తిరుపతిలోని పదవ అదనపు జిల్లా జడ్జి కోర్టులో కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో లాయర్‌గా అప్పట్లో మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామిని టీటీడీ నియమించింది.
సుబ్రహ్మణ్య స్వామి స్వతహాగా లాయర్ కాదు.. అయినా సరే అడ్వొకేట్ యాక్ట్ సెక్షన్ 32ను ఆధారంగా వాదనలు వినిపిస్తున్నారు. ఈ కేసు వాయిదాల కోసం సుబ్రహ్మణ్యం విమానంలో ఢిల్లీ నుంచి వచ్చేవారు. ఈ క్రమంలో టీటీడీకి బలమైన న్యాయ విభాగం ఉంది.. ఫీజు చెల్లించి లాయర్లను నియమించుకోవచ్చు. కానీ లాయర్‌గా సుబ్రహ్మణ్య స్వామిని నియమించడం అప్పుడే చర్చనీయాంశమైంది. సుబ్రహ్మణ్య స్వామికి భారీ ఫీజు చెల్లించాల్సి ఉండడం వల్ల ఆర్థిక భారం పడుతుందన్న ఆలోచనతో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. సుబ్రహ్మణ్య స్వామిని లాయర్‌గా తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది టీటీడీ. ఈ కేసులో ప్రతి వాయిదాకు సుబ్రహ్మణ్య స్వామి విమానంలో వస్తున్నారు. ఆ ఖర్చులు ఎవరు భరించారో ఇంకా తేలక.. ఆర్థిక భారాన్ని తప్పించుకోవడానికి స్వామిని తప్పిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos