అమరావతి కేంద్రంగా వరుస నిర్ణయాలు జరుగుతున్నాయి. ఈ రోజు ఏపీ మంత్రివర్గ భేటీలో కీలక అంశాల పైన చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ప్రధానంగా అమరావతికి రుణం.. కొత్త నిర్మాణాలు.. రైతుల సమస్యల పైన మంత్రివర్గంలో చర్చించనున్నారు. రెండో విడత లాండ్ పూలింగ్ కు గత భేటీలోనే ఆమోదం తెలిపారు. కాగా, విశాఖ కేంద్రంగా ఐటీ సంస్థలు.. ఉద్యోగాలు.. మంత్రుల పనితీరు.. వార్షిక నివేదికల పైన మంత్రివర్గ భేటీలో చర్చించనున్నారు. మంత్రుల తో రాజకీయ అంశాల పైన చర్చ జరిగే అవకాశం ఉంది.

రూ.169కోట్లతో లోక్ భవన్ (గవర్నర్ బంగ్లా) నిర్మాణానికి టెండర్లు పిలిచేందుకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అదేవిధంగా జ్యుడిషియల్ అకాడమీ నిర్మాణా నికి రూ.163 కోట్ల కు పరిపాలనా అనుమతులకు ఆమోద ముద్ర వేయనున్నారు. 2024-25 వార్షిక నివేదికలు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. నాబార్డు నుంచి అమరావతి నిర్మాణానికి 7380.70 కోట్లు రుణం తీసుకునేందుకు CRDA కి అనుమతి ఇచ్చే అంశం పైన కేబినెట్ ఆమోద ముద్ర వేయనుందని సమాచారం. కాగా, సీడ్ యాక్సిస్ రహదారిని 16వ జాతీయ రహదారికి అనుసంధించే పనులకు 532కోట్ల మేర ఆమోదం తెలపనుంది. తాజాగా SIPB సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనుంది. 20వేల కోట్లు పెట్టుబడులు, 56 వేల ఉద్యోగాల కల్పనకు తీసుకున్న నిర్ణయాలను మంత్రివర్గం ఆమోదించనుంది. రాష్ట్రంలో పెట్టుబడుల్లో భాగంగా పలు సంస్థలకు భూ కేటాయింపులు అనుమతి ఇవ్వనుంది.

కేబినెట్ అనంతరం...తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. 18 నెలల పాలన పూర్తి కావటంతో సంక్షేమ పథకాలు.. పాలనలో భాగంగా తీసుకొచ్చిన మార్పులపైన ప్రజల్లోకి మరింతగా వెళ్లాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. అందులో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ నెల 17,18 తేదీల్లో జరిగే కలెక్టర్ల సదస్సుకు మంత్రులు పూర్తిగా సమాయత్తం కావాలని.. అదే విధంగా రెవిన్యూ సంబంధిత ఫిర్యాదుల పరిష్కారం దిశగా కసరత్తు వేగవంతం చేసేలా ఈ రోజు సమావేశంలో నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos