తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపిన కర్నూలు బస్సు అగ్నిప్రమాదం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుల్లో ఒకరైన వేమూరి కావేరి ట్రావెల్స్ యజమాని వేమూరి వినోద్ కుమార్‌ను కర్నూలు పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా, ఆయనకు బెయిల్ మంజూరు కావడంతో వెంటనే విడుదలయ్యారు. గత నెల అక్టోబర్ 24న హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్‌కు చెందిన బస్సు ప్రమాదానికి గురైంది. కర్నూలు జిల్లా ఉలిందకొండ మండలం చిన్నటేకూరు వద్ద రోడ్డుపై ఆగి ఉన్న ఓ బైక్‌ను బస్సు ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘోర దుర్ఘటనలో 19 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనపై ప్రమాదం నుంచి బయటపడిన రమేష్ అనే ప్రయాణికుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో బస్సు డ్రైవర్ మిర్యాల లక్ష్మయ్యను A1 నిందితుడిగా చేర్చి ఇప్పటికే అరెస్ట్ చేశారు. తాజాగా, బస్సు యజమాని వేమూరి వినోద్ కుమార్‌ను A2 నిందితుడిగా పేర్కొంటూ అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను స్పెషల్ మొబైల్ కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన న్యాయమూర్తి, రూ.10 వేల సొంత పూచీకత్తుపై వినోద్ కుమార్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. కాగా, ప్రమాదానికి గురైన బస్సు విషయంలో యాజమాన్యం నిబంధనలు ఉల్లంఘించినట్లు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. సీటింగ్ పర్మిషన్ ఉన్న బస్సును అక్రమంగా స్లీపర్ కోచ్‌గా మార్చి నడిపినట్లు అధికారులు గుర్తించారు. ఈ కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా రవాణా శాఖ అధికారులు కఠిన నిబంధనలు అమలు చేయాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos