తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్), తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొనుగోలు విభాగం జనరల్ మేనేజర్ (జీఎం) కె. సుబ్రహ్మణ్యంను గురువారం అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఇప్పటివరకు కాంట్రాక్టర్లు, వ్యాపారులు అరెస్ట్ కాగా, టీటీడీకి చెందిన ఓ ఉన్నతాధికారిని అదుపులోకి తీసుకోవడం ఇదే తొలిసారి. ఈ అరెస్టుతో కేసులో మొత్తం నిందితుల సంఖ్య 10కి చేరింది.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టిన సిట్, కల్తీ నెయ్యి సరఫరాలో జీఎం సుబ్రహ్మణ్యం పాత్ర ఉందని గుర్తించింది. కొనుగోలు ప్రక్రియలో అవకతవకలకు పాల్పడటంతో పాటు, నాణ్యత లేని నెయ్యి సరఫరాకు ఆయన సహకరించారని బలమైన ఆరోపణలు ఉన్నాయి. గతంలో నెయ్యి సరఫరా చేసిన కాంట్రాక్టర్లను విచారించగా వెల్లడైన వివరాల ఆధారంగా సుబ్రహ్మణ్యంను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

అరెస్టు చేసిన అనంతరం సుబ్రహ్మణ్యంను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయన్ను నెల్లూరులోని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు సిట్ అధికారులు తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు ఆయన్ను రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది. భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై ఏపీ హైకోర్టు ఆదేశాలతో మొదలైన దర్యాప్తు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కొనసాగుతోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos