ఏపీ మద్యం స్కాంలో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ హయాంలో జరిగిందని భావిస్తున్న ఈ స్కాంపై ఇప్పటికే దర్యాప్తు చేస్తున్న సీఐడీ సిట్ విభాగం పలువురు నిందితుల్ని అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ కేసులో ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై దర్యాప్తు జరుపుతున్న సిట్ అధికారులు ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు పలువురు నిందితుల్ని అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మద్యం సంస్థల నుంచి అందుకున్న ముడుపులతో భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆయన ఆస్తుల జప్తుకు ప్రభుత్వం అనుమతి కోరారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సిట్ కు చెవిరెడ్డి ఆస్తుల జప్తుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం స్కామ్‌లో ఇప్పటికే ఇతర నిందితుల ఆస్తుల జప్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఇదే క్రమంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుటుంబ ఆస్తుల జప్తుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. చెవిరెడ్డి కుటుంబం అక్రమంగా భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు సిట్‌ గుర్తించింది. మద్యం కమీషన్ల ద్వారా చెవిరెడ్డి కుటుంబం భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు అధికారులు ఆరోపిస్తున్నారు.

అప్పటి సీఎం జగన్ కు సన్నిహితుడిగా పేరున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఈ కేసులో సిట్ ఏ38గా చేర్చింది. మద్యం స్కాం ద్వారా లభించిన డబ్బును గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధులకు పంచారనే ఆరోపణలు కూడా చెవిరెడ్డిపై ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన అస్తులు అటాచ్ మెంట్ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సిట్ అధికారులు త్వరలోనే చెవిరెడ్డికి చెందిన 65 కోట్లకు పైగా విలువైన ఆస్తుల్ని అటాచ్ చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే చెవిరెడ్డి కుటుంబానికి భారీ ఎదురుదెబ్బ తగిలినట్లే భావించాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos