ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన అన్నమయ్య జిల్లా మదనపల్లెలో చిన్నారిని దారుణంగా హత్య చేసిన కేసులో నిందితుడు కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడు. కురబల కోట మండలం కనసానివారిపల్లి దగ్గర చెరువులో నిందితుడి మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే ముదివేడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడు కులవర్ధన్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతడి మృతదేహాన్ని పోలీసులు పోస్ట్‌మార్టమ్ కోసం ఆస్పత్రికి తరలించారు.

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఏడేళ్ల బాలిక కనిపించకుండా పోయింది. పోలీసులు పాప కోసం మూడు రోజులుగా గాలిస్తుండగా.. పొరుగింట్లోనే చిన్నారి మృతదేహం లభించడం కలకలం రేపింది. బాలికను దారుణంగా చంపి డ్రమ్ములో దాచాడు పొరుగింటి యువకుడు. బాలికకు మాయమాటలు చెప్పి, చాక్లెట్ ఆశజూపి ఇంట్లోకి తీసుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టాడు. మదనపల్లి పట్టణ శివార్లలోని నీరుగట్టువారిపల్లిలోని కాట్లాటపల్లి రోడ్డులో నివసిస్తున్న దంపతుల ఏడేళ్ల కుమార్తె సోమవారం సాయంత్రం నుంచి కనిపించకుండాపోయింది. చుట్టుపక్కల గాలించినా ఫలితం లేకపోవడంతో తల్లిదండ్రులు అదే రోజు సాయంత్రం 4.30 గంటలకు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసులు బాలిక కనిపించకుండా పోయిన ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఈ క్రమంలో ఇంటి పక్కనే నివసించే కులవర్దన్ అనే యువకుడు బాలికను తీసుకెళ్లినట్లుగా గుర్తించారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. బాలికను గొంతు నులుమి హత్య చేసి.. మృతదేహాన్ని డ్రమ్‌లో కుక్కాడు. బాలికపై లైంగిక దాడికి పాల్పడి ఈ దారుణానికి ఒడిగట్టినట్టు అనుమానిస్తున్నారు. నిందితుడు గతంలోనూ ఇద్దరు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడని స్థానికులు అంటున్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కూతురు విగత జీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు  కన్నీరుమున్నీరయ్యారు. కులవర్ధన్ తల్లితో కలిసి ఆ ఇంట్లో నివాసం ఉంటున్నాడు.. ఆమె ఓ స్కూల్‌లో ఆయాగా పనిచేస్తున్నారు. కులవర్ధన్ ఖాళీగా ఉంటూ జులాయిగా తిరుగుతున్నాడు. అతడికి గంజాయి, మద్యం అలవాట్లు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. అతడు ఒకరిపై కొడవలి తీసుకుని దాడి చేయగా.. కేసు కూడా నమోదైంది. మదనపల్లె ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు.. వెంటనే నిందితుడ్ని పట్టుకోవాలని పోలీసులను ఆదేశించారు. అలాగే బాలిక తండ్రితో హోంమంత్రి వంగలపూడి అనిత ఫోన్‌లో మాట్లాడారు. అలాగే రాయలసీమ డీఐజీ కోయ ప్రవీణ్ మదనపల్లెకి స్వయంగా వెళ్లారు.. అక్కడ పరిస్థితిని పర్యవేక్షించారు. అయితే ఈ ఘటన తర్వాత కులవర్ధన్ పరారయ్యాడు.. అతడి కోసం పోలీసులు గాలిస్తున్న క్రమంలో అతడి మృతదేహాన్ని చెరువులో గుర్తించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos