ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వై.ఎస్. వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తదుపరి దర్యాప్తు పరిధిని కేవలం ఇద్దరు వ్యక్తులకు మాత్రమే పరిమితం చేస్తూ హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ వివేకా కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీతారెడ్డి సుప్రీంకోర్టులో కొత్తగా పిటిషన్ దాఖలు చేశారు. ట్రయల్ కోర్టు నిర్ణయం .. తాము లేవనెత్తిన అంశాలకు, సుప్రీంకోర్టు గతంలో జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉందని సునీత తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు అవసరంపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని గతంలో సుప్రీంకోర్టు ట్రయల్ కోర్టును ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ ఆదేశాల మేరకు విచారణ జరిపిన సీబీఐ కోర్టు, ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన అంశాలపై మాత్రమే దర్యాప్తును పరిమితం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పాక్షిక ఉత్తర్వులనే సునీతారెడ్డి తాజాగా సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి సోదరుడైన వివేకానందరెడ్డి, 2019 మార్చి 15న కడప జిల్లా పులివెందులలోని తన నివాసంలో దారుణహత్యకు గురయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో దర్యాప్తు, విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదని ఆందోళనలు వ్యక్తమవడంతో, ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేసింది. ఈ కేసులో కడప ఎంపీ వై.ఎస్. అవినాష్ రెడ్డి సహా పలువురిని నిందితులుగా చేర్చి సీబీఐ ఛార్జిషీట్లు దాఖలు చేసింది.

సాక్షులను ప్రభావితం చేయడం, సాక్ష్యాధారాలను తారుమారు చేయడం వంటి అంశాలపై మరింత లోతుగా దర్యాప్తు జరపాలని సునీత మొదటి నుంచి న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. సునీత దాఖలు చేసిన ఈ తాజా పిటిషన్‌ను, ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న ఇతర పిటిషన్లతో కలిపి విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ఈ పరిణామంతో ఆరేళ్లుగా కొనసాగుతున్న ఈ కేసులో దర్యాప్తు భవిష్యత్తు ఎలా ఉండబోతోందనే అంశంపై సుప్రీంకోర్టు తీర్పు కీలకం కానుంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos