జనసేన ఆవిర్భావం నుంచీ పార్టీలో ఉన్న సీనియర్ నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి కూడా అయిన బొలిశెట్టి సత్యనారాయణ ఇవాళ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో తనను అన్ని పదవుల నుంచీ తప్పించాలంటూ అధినేత పవన్ కళ్యాణ్ కు ఓ లేఖ రాశారు. రాష్ట్రంలో అధికార కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీలో ఉంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో వేసిన ప్రజాప్రయోజన వాజ్యమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అమరావతి రాజధానిలో పర్యావరణ ఉల్లంఘనలపై బొలిశెట్టి సత్యనారాయణ గతంలో చేసిన వ్యాఖ్యలపై ఇటీవల తాజాగా మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తీవ్ర విమర్శలు చేశారు. దీంతో బొలిశెట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పర్యావరణ న్యాయం కోసం తన ప్రధాన కార్యదర్శి పదవి నుండి ఇతర అనుబంధ పదవుల నుండి బయటకు వస్తున్నానని ఆయన ఇవాళ మంగళవారం ట్వీట్ చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ కు ఈ మేరకు విజ్ఞప్తి చేస్తూ రాసిన లేఖను కూడా జత చేశారు.

​ఆంధ్రప్రదేశ్‌లో కాలుష్యానికి సంబంధించి దాఖలైన ఒక ప్రధాన పర్యావరణ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL 248/2020)లో తాను పిటిషనర్‌గా ఉన్నానని, ఈ నేపథ్యంలో తాను "నైతిక విరామం" తీసుకోవలసిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ప్రభుత్వంపై కేసు వేసిన వ్యక్తిగా, అధికార కూటమిలో కీలక నేతగా ఉన్న తన పాత్రల మధ్య ఎటువంటి విభేదాలు రాకుండా చూసుకోవడం అవసరమన్నారు.​ప్రస్తుతం జనసేన పార్టీ ఎన్డీయే  ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉండటం, అలాగే పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పర్యావరణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తుండటంతో​ పరస్పర ప్రయోజనాల సంఘర్షణ (Conflict of Interest) నివారణ కోసం, స్వచ్ఛమైన నీరు, గాలి కోసం జరుగుతున్న న్యాయ పోరాటం రాజకీయ కారణాల వల్ల ప్రభావితం కాకూడదని నిర్ధారించడం కోసం ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చిందన్నారు.

ఇకపై​ తన దృష్టి పర్యావరణ పరిరక్షణపైనే  అని ఆయన అన్నారు. 'జల్ బిరాదరీ' నేషనల్ కన్వీనర్‌గా తన బాధ్యతలకు, "మన నుడి - మన నది" కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వడం తన కర్తవ్యంగా భావిస్తున్నానని తెలిపారు.​పార్టీ పదవి నుండి తాత్కాలిక విరామం మాత్రమే, రాజీనామా కాదన్నారు. జనసేన సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటానని, న్యాయపరమైన పరిష్కారం లభించిన తర్వాత అధిష్టానం కోరుకుంటే పార్టీ బాధ్యతలు తీసుకొనే అవకాశం ఉందని తెలిపారు. జనసేన సిద్ధాంతాల పట్ల తన నిబద్ధత అచంచలమని, అయితే, పర్యావరణ న్యాయం విషయంలో ఎటువంటి రాజీ పడకూడదనే ఉద్దేశంతో, ప్రస్తుత అధికార యంత్రాంగం నుండి స్పష్టమైన దూరం పాటించడం తన నైతిక, ధర్మబద్ధమైన బాధ్యతని ఆయన తెలిపారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos