ఏపీ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. బీజేపీ ఏపీలో పక్కా వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటోంది. మిషన్ 2029 లక్ష్యంగా అడుగులు వేస్తోంది. కూటమిలో భాగస్వామిగా బీజేపీ ఉంటూనే సొంతంగా బలం పెంచుకోవటం పైన ఫోకస్ చేసింది. ఇప్పటికే ఏపీ కేంద్రంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజా నియామకాల్లోనూ సామాజిక లెక్కలకు ప్రాధాన్యత ఇచ్చింది. కాగా, ఇప్పుడు బీజేపీ మాజీ చీఫ్ పురందేశ్వరికి కీలక పదవి కట్టబెట్టేందుకు రంగం సిద్దమైంది.
రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో సామాజిక సమీకరణాల్లో భాగంగా మాధవ్ కు పార్టీ బాధ్యతలను అప్పగించారు. పురందేశ్వరికి రెండు పదవుల విషయంలో పరిశీలన చేస్తున్నట్లు పార్టీ ముఖ్య నేతల సమాచారం. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఇవ్వటంపైన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అయితే, అగ్రనాయకత్వం లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీకి మహిళా అధ్యక్షురాలి నియామకం పైనా చర్చలు జరుగుతోంది. అందులో పార్టీలో తొలి నుంచి కొనసాగుతున్న మహిళా నేతకు పట్టం కట్టే అవకాశం కనిపిస్తోంది. కాగా, ఏపీ నుంచి పురందేశ్వరికి లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వటం ద్వారా భవిష్యత్ సమీకరణాల్లో భాగంగా బీజేపీ నాయకత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
పురందేశ్వరికి హిందీ, ఇంగ్లీషు భాషల్లో ప్రావీణ్యం.. పార్లమెంట్ వ్యవహారాల పైన ఉన్న అనుభవంతో డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తారని ఢిల్లీ ముఖ్య నేతల్లో తాజాగా చర్చ మొదలైంది. ఏపీలో సొంతం గా ఎదిగేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తున్న ప్రధాని మోదీ అటు కేంద్రం నుంచి రాష్ట్రానికి తోడ్పాటు అందిస్తూనే.. ఏపీలోని ప్రస్తుత రాజకీయ పరిణా మాలను తమకు అనుకూలంగా మల చుకునే వ్యూహాలు అమలు చేస్తున్నారు. అందులో భాగంగా ఏపీ కేంద్రంగా వచ్చే వారం కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం కనిపిస్తోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందే ఈ మేరకు అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos