వైసీపీ ముఖ్య నేత కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. వైసీపీ హయాంలో మంత్రిగా పని చేసిన కొడాలి నాని కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొడాలి నాని పైన కొన్ని కేసులు నమోదయ్యాయి. వాటి పైన ఆయన కోర్టులో పోరాటం చేస్తున్నారు. కాగా ఎన్నికల్లో ఓటమి తరువాత రాజకీయంగా అంత యాక్టివ్ గా లేరు. జగన్ వద్ద సమావేశాలకు మాత్రం హాజరవుతున్నారు.

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొడాలి నాని తన వ్యాఖ్యలతో వివాదాస్పదంగా మారారు. టీడీపీ, చంద్రబాబు పైన అనుచిత వ్యాఖ్యలతో ఆయన తీరు వివాదాస్పదంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొడాలి నాని పైన కేసుల్లో విచారణకు సిద్దమయ్యారు. కాగా, కొడాలి నాని కోర్టులను ఆశ్రయించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కొడాలి నాని పైన చర్యలు తీసుకోవాలని టీడీపీ మద్దతుదారులు డిమాండ్ చేసారు. కొడాలి నాని అనుచరుల పైన కేసులు నమోదయ్యాయి. వల్లభనేని వంశీ ఇప్పటికే జైలులో ఉన్నారు. రాజకీయంగా వరుస పరిణామాలు చోటు చేసుకుంటున్న ఈ క్రమంలో కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఛాతీ నొప్పి రావటంతో ప్రస్తుతం ఆయన్ను హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స కోసం తరలించారు. గ్యాస్ సంబంధిత సమస్యలని చెబుతున్నారు. పూర్తి పరీక్షల తరువాత నిర్దారిస్తామని, ప్రస్తుతం పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos