మాజీమంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని పైన టీడీపీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పేర్ని నాని బందర్ కే కాదు ఈ రాష్ట్రానికే పెద్ద పిచ్చోడు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. నిన్న పేర్ని నాని కొల్లు రవీంద్ర ను టార్గెట్ చేసి పగటి వేషగాడు అంటూ వ్యాఖ్యలు చేయగా, ఇవాళ పేర్ని నానిని పెద్ద పిచ్చోడు అంటూ ఆయన టార్గెట్ చేశారు. అంతేకాకుండా... ప్రభుత్వ హయాంలో పేర్ని నాని రవాణా శాఖ మంత్రిగా, కొడాలి నాని పౌరసరఫరాల శాఖ మంత్రిగా భారీ అవినీతికి పాల్పడ్డారని కొల్లు రవీంద్ర సంచలన ఆరోపణలు చేశారు. అమాయకుల పేర్ల మీద కోట్ల రూపాయలు దండుకున్నారని ఆయన ఆరోపించారు. అవినీతి, అక్రమాల లో వైసీపీ నేతలను మించి ఎవరూ ముందుకు పోలేరన్నారు.

ఇసుక అక్రమాలకు పాల్పడ్డారని తనపైన ఆరోపణలు చేస్తున్నారని దీనిపైన ప్రమాణం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, మరి పేర్ని నాని కూడా ప్రమాణం చేసేందుకు సిద్ధమేనా అంటూ కొల్లు రవీంద్ర సవాల్ విసిరారు. ప్రజలు చల్లగా ఉంటే జగన్ కు కడుపు మంటగా ఉంటుందని, అందుకే అచ్చోసిన ఆంబోతుల్లా కొందరు వైసీపీ నేతలు బరితెగించి మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఎన్నికలలో గెలిచేందుకు దొంగ పట్టాలు పంపిణీ చేసింది మీరు కాదా అంటూ ప్రశ్నించారు. కులాల మధ్య, కుటుంబాల మధ్య చిచ్చుపెట్టే స్థాయికి పేర్ని నాని దిగజారారని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. రప్ప రప్ప నరికేయమని చెప్పేవారిని సైకో అంటారా... లేక అలా అనడం తప్పు అని చెప్పే మమ్మల్ని సైకో అంటారా అంటూ కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. ఇదిలా ఉంటే నిన్నటికి నిన్న పేర్ని నాని కొల్లు రవీంద్ర పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని కొల్లు రవీంద్ర మహాతల్లి అని మాట్లాడుతున్నారని, కానీ ఆమె మహానటి అంటూ సంచలన ఆరోపణలు చేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో వాళ్లే గొడవలు సృష్టించి వాళ్లే కేసులు పెట్టి రచ్చ చేస్తున్నారని కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇక మంత్రి కొల్లు రవీంద్ర ను టార్గెట్ చేయడంతో, తాజాగా ఆయన పేర్ని నానికి ఘాటుగా బదులిచ్చారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos