రాజధాని అమరావతి మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా తీవ్ర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న పాత్రికేయుడు వీవీఆర్ కృష్ణంరాజుకు మంగళగిరి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ రోజు మధ్యాహ్నం ఆయనను కోర్టులో హాజరుపరచగా, ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ నెల 26వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో కృష్ణంరాజును గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.

సాక్షి టీవీ ఛానల్‌లో ఈ నెల 6వ తేదీన ప్రసారమైన ‘కేఎస్ఆర్ లైవ్ షో’ అనే చర్చా కార్యక్రమంలో వీవీఆర్ కృష్ణంరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరావతి మహిళల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. అమరావతి వేశ్యల రాజధాని అన్నారు. ఆ వ్యాఖ్యలు మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా, అత్యంత హేయంగా ఉన్నాయంటూ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. పలు పోలీస్ స్టేషన్లలో ఆయనపై ఫిర్యాదులు కూడా అందాయి.

ఈ క్రమంలో అమరావతి జేఏసీ దళిత నాయకురాలు కంభంపాటి శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో కృష్ణంరాజును ప్రధాన నిందితుడిగా అంటే ఏ1 పేర్కొన్నారు. కాగా, ఇదే కేసులో రెండో నిందితుడిగా ఏ2 గా ఉన్న సాక్షి టీవీ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు ఇప్పటికే అరెస్ట్ అయి రిమాండ్‌లో ఉన్న విషయం విదితమే. తాజా పరిణామంతో ఈ కేసులో ఇద్దరు పాత్రికేయులు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నట్లయింది. ఈ ఘటన మీడియా వర్గాల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos