ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే హామీ ఇచ్చిన విధంగా ఈ నెలలోనే రైతులకు అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులకు సమాయత్తం అవుతోంది. ఈ మేరకు మార్గ దర్శకాల పైన కసరత్తు జరుగుతోంది. దీంతో పాటుగా విద్యా సంవత్సరం ప్రారంభంలోగా తల్లికి వందనం అమలు పైన నిర్ణయం చేసారు. తాజాగా సీఎం చంద్రబాబు ఈ పథకం అమలు పైన స్పష్టత ఇచ్చారు. కాగా, ఒకే విడతలోనే అమలు చేస్తారా.. రెండు విడతలుగా చెల్లిస్తారా అనేది చర్చగా మారింది. ఇక.. దాదాపుగా ఈ పథకం అమలులో నిబంధనలు ఖరారైనట్లు తెలుస్తోంది.

ఇప్పటికే వార్షిక బడ్జెట్ లో తల్లికి వందనం పథకం కోసం నిధులు కేటాయించారు. హామీ ఇచ్చిన విధంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ రూ 15 వేలు చొప్పున ఇస్తామని తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. అదే సమయంలో ఈ పథకం అమలుకు సంబంధించి మార్గదర్శకాలు ఇప్పుడు లబ్దిదారుల ఎంపికలో కీలకం కానున్నాయి. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంలోగానే తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని ప్రభుత్వం ఇప్పటి కే పలు మార్లు స్పష్టం చేసింది. శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకార భరోసా విడుదల సమయంలో తల్లికి వందనం పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ పథకం అమలు చేస్తామని మరోసారి స్పష్టం చేసారు. విద్యా సంవత్సరం ప్రారంభం లోగా ఇస్తామని చెబుతూనే... ఒక ఇన్ స్టాల్ మెంటా లేక ఎలా ఇవ్వాలనేది ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు.

దీంతో, ఒకే విడతలో రూ 15 వేలు చెల్లిస్తారా.. రెండు విడతలుగా రూ 7500 చొప్పున చెల్లించే ఆలోచన చేస్తున్నారా అనే చర్చ మొదలైంది. ఇప్పటికే ఈ పథకం అమలుకు సంబంధించిన లబ్దిదారుల సంఖ్య... కావాల్సిన నిధుల పైన ఒక అంచనాకు వచ్చారు. ఇదే నెలలో అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులను విడుదల చేయాల్సి ఉండటంతో ఇన్ స్టాల్ మెంట్ అంశం తెర పైకి వచ్చినట్లు కనిపిస్తోంది. కాగా, తాజాగా చంద్రబాబు కూటమి నేతలతో టెలి కాన్ఫిరెన్స్ లో తల్లికి వందనం పాఠశాలల ప్రారంభానికి ముందే అమలు చేస్తామని స్పష్టత ఇచ్చారు. 2025- 26 బడ్జెట్‌లో రూ. 9407 కోట్లు ఈ పథకానికి కేటాయింపులు చేసారు. 2024-25 విద్యా సంవత్స రంలో రాష్ట్రంలో దాదాపు 81 లక్షల మంది విద్యార్ధులు చదువుతున్నారు. అయితే ఇందులో ప్రాధమికంగా 69.16 లక్షల మంది ఈ పథకానికి అర్హులుగా విద్యాశాఖ తేల్చిన్నట్లు సమాచారం.

ఈ పథకం అమలుకు సంబంధించిన విధి విధానాల పైన అధ్యయనం కొనసాగుతోంది. పథకం అమల్లో భాగంగా విద్యార్ధులకు 75 శాతం హాజరు నిబంధన కొనసాగనుంది. గతంలో వైసీపీ ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను సమీక్షిస్తున్నారు. ఆదాయ పన్ను చెల్లింపుదారులు.. తెల్లరేషన్‌ కార్డు లేనివారికి, 300 యూనిట్ల విద్యుత్‌ వినియోగించేవారికి, కారు కలిగి ఉన్న వారికి, అర్బన్‌ ప్రాంతంలో 1000 చదరపు అడుగులు కలిగి ఉన్నవారికి పథకం అందటం లేదు. ఇక, ఇప్పుడు కొత్త నిబంధనలను అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది. విద్యుత్ వినియో గం, కారు ఉండటం వంటి నిబంధనలను గతంలో వ్యతిరేకించిన కూటమి నేతలు ఇప్పుడు మినహాయింపు ఇస్తారా.. లేక, కొనసాగిస్తారా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos