ఏపీ: నేటితరం విద్యార్థుల ఆలోచన విధానానికి అనుగుణంగా సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతూ విద్యను అందించడం ద్వారా విద్యా వ్యవస్థను బలోపేతం చేయవచ్చని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) అన్నారు. కేబీఎన్ కళాశాల 60వ వార్షికోత్సవ వేడుకలను కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి  ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేబీఎన్ కళాశాల ఆరు దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానం ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తును మార్చిందన్నారు. వేలాది మంది విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దిన కేబీఎన్ కళాశాల 60వ వార్షికోత్సవ వేడుకలలో పాల్గొనడం సంతోషాన్నిచ్చిందన్నారు. కళాశాల అభివృద్ధికి, అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేసి , అధ్యాపకుల, సిబ్బంది, సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. విద్యా సంస్థలు రాజకీయాలకతీతంగా ఉంటూ సేవలను అందించాలన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అధ్యాపకులు కూడా మారుతూ భవిష్యత్ ప్రణాళికలను రూపొందించుకోవాలన్నారు. పేద విద్యార్థులకు సహకారం అందిస్తూ, కుల,మత వర్గ బేధాలు లేకుండా అధ్యాపకులందరూ సమిష్టిగా విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. పశ్చిమ లో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి  ఎంప్లాయిమెంట్, ఎంట్రప్రెన్యూర్ షిప్, ఎడ్యుకేషన్ అనే నూతన కార్యక్రమాన్ని విజయదీపం, పేరిట ప్రారంభించామన్నారు. విద్యార్థులందరూ క్రమశిక్షణ, హార్డ్ వర్క్ తోపాటు స్మార్ట్ వర్క్ చేయడం అలవర్చుకోవాలన్నారు. 60 ఏళ్లుగా దేదీప్యమానంగా వెలుగుతూ కళాశాల అభివృద్ధిని తమ భుజస్కందాలపై మోస్తున్న ఎస్ కే పి వి హిందూ హై స్కూల్ కమిటీ జనరల్ సెక్రెటరీ అండ్ కరస్పాండెంట్ గోపిశెట్టి మల్లయ్య, తూనిగుంట్ల శ్రీనివాస్, మరియు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రిన్సిపల్ వి నారాయణరావులను అభినందించారు.  అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వి నారాయణ రావు మాట్లాడుతూ 12,000 వేల మంది విద్యార్థినీ విద్యార్థులతో 300 మంది సిబ్బందితో కేబీఎన్ కళాశాల దేదీప్యమానంగా వెలుగుతోందన్నారు.  ఆరు దశాబ్దాలుగా కేబీఎన్ కళాశాల అంచలంచెలుగా ఎదుగుతూ ఎన్నో వేల మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో  ప్రముఖ పాత్ర పోషించిందన్నారు. కళాశాల అభివృద్ధికి సహకరిస్తున్న కమిటీ పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos