వైసీపీ నేతలకూ మద్యం దుకాణాలు లాటరీలో తగిలాయి. ఏపీ ప్రభుత్వం మద్యం పాలసీని మార్చింది. అప్లికేషన్ పెట్టుకున్న వారికి లాటరీ పద్దతిలో దుకాణాలు లభించాయి. చాలా మంది వైసీపీ నేతలు పారదర్శకంగా జరుగుతాయా లేదా అని అనుమానం వ్యక్తం చేశారు కానీ తమకు.. తమ సిండికేట్ కు దుకాణాలు వచ్చే సరికి నమ్మక తప్పలేదు. రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల టెండర్లలో కొంత మంది వైసీపీ నేతలకూ దుకాణాలు రావడంతో తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడుకన్నా ఇప్పుడు ఉపాధి దొరుకుతోందని సంతోషపడుతున్నారు.
జగన్ అధికారంలోకి రాక ముందు మద్యం దుకాణాల వేలం పాలసీనే ఉండేది. కానీ అంతా తానొక్కనేడినే దోచుకోవాలనుకున్న జగన్ కొత్త మద్యం పాలసీ తెచ్చారు. దాని ప్రకారం.. మొత్తం ప్రభుత్వం చేతుల్లో అంటే జగన్ చేతుల్లో ఉంటుంది. దుకాణాల అద్దె, సిబ్బంది జీతాలు ఎక్సైజ్ సిబ్బంది నెత్తిన పడేశారు. ఇక సొంత బ్రాండ్ల సరుకు నుంచి ట్రాన్స్ పోర్టు వరకూ మొత్తం వారి గుప్పిట్లోనే. మరెవరికీ ఒక్క రూపాయి పోకుండా చేసుకున్నారు. ఐదేళ్లలో వేల కోట్లు దోచుకున్నారు. బార్లకు కోట్లకు కోట్ల ఫీజులు పెట్టి తమ పార్టీ నేతలు కూడా వద్దు బాబోయ్ అనుకుని పారిపోయేలా చేశారు.
ఇప్పుడు మళ్లీ ప్రభుత్వం పాత పాలసీ తీసుకు వచ్చింది. టీడీపీ నేతలు కూడా పెద్ద ఎత్తున అప్లికేషన్లు వేయాల్సి వచ్చింది. మంత్రి నారాయణ అప్లికేషన్లకు పార్టీ కార్యకర్తల కోసం డబ్బులు కట్టారు. అందులో నాలుగో.. ఐదో మాత్రమే లాటరీలో వచ్చాయి. వాటినే కార్యకర్తలకు ఉపాధి కోసం ఇచ్చారు. పలువురు టీడీపీ నేతలకు చాలా డబ్బులు అప్లికేషన్ల కోసం పోయాయి. అయితే ఎక్కువగా వైసీపీ నేతలు అప్లికేషన్లు వేయడానికి వెనుకడుగు వేశారు. కానీ ధైర్యం చేసిన వారికి మేలు జరిగింది. పారదర్శక పాలన అంటే ఇదేనని ఇప్పుడు వారు ప్రశంసిస్తున్నారు.
ఇదిలా ఉండగా... సహజంగా మద్యం దుకాణాలో ఒకటి వస్తే అది ఓకే. దానినే అదృష్టమంటారు. కానీ ఏకంగా జిల్లాలో ఐదు దుకాణాలకు తన పేరు వస్తే మాత్రం దానిని లక్కు అనరు. దానికన్నా పెద్ద పదం అన్నది వాడాల్సి ఉంటుంది. జాక్ పాట్ కొట్టినట్లేనని చాలా మంది అనుకుంటారు. అటువంటి సంఘటనే శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగింది. ఒకే వ్యక్తికి ఐదు మద్యం దుకాణాలు రావడంతో ఆయన అదృష్టాన్ని చూసి మిగిలిన వారు కుళ్లుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు.
ఆయన ఎవరో కాదు. బీజేపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు. ఆయన ఏకంగా ఐదు దుకాణాలను లక్కీ లాటరీలో దక్కించుకున్నారు. పుట్టపర్తి కలెక్టర్ చేతన్ ఆధ్వర్యంలో లాటరీ విధానంలో మద్యం షాపులను తీశారు. అయితే వరసగా ధర్మవరం మున్సిపాలిటీలో దుకాణం ఒకటో నెంబరు, నాలుగో నెంబరు, ధర్మవరం రూరల్ ప్రాంతంలో పన్నెండో నెంబరు, ముదిగుబ్బ మండలంలో 19 నెంబరు దుకాణం, బత్తలపల్లి మండలంలోని 14వ నెంబర్ దుకాణాలకు ఈయన పేరే లాటరీలో వచ్చింది. అంటే ఆయన ఒక్కడికే ఐదు మద్యం షాపులు ఒకే ఏరియాలో లభించడంతో ఆయన అనుచరులు సంబరాలు చేసుకుంటున్నారు. అదృష్టం అంటే అదీమరి అని అందరూ అనుకుంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos