కర్నూలు జిల్లాకు చెందిన చిన్నారి పునర్విక ప్రాణాలను కాపాడేందుకు ఏపీ మంత్రి నారా లోకేష్ చొరవ తీసుకున్నారు. వెన్నెముక కండరాల క్షీణత అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఈ పాపకు అత్యవసరమైన రూ. 16 కోట్ల విలువైన జోల్గెన్స్మా ఇంజెక్షన్ కోసం ఆయన పెద్ద మనసుతో ముందుకు వచ్చారు. ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా క్రౌడ్ ఫండింగ్ రూపంలో సుమారు పది కోట్ల రూపాయలు సమకూరగా, మిగిలిన రూ. 6 కోట్లను సమకూర్చే బాధ్యతను లోకేష్ స్వయంగా తీసుకున్నారు.

తమ బిడ్డ ప్రాణాలను కాపాడుకునేందుకు పునర్విక తల్లిదండ్రులు చేస్తున్న పోరాటం నెటిజన్లను కదిలించింది. వేలాది మంది దాతలు స్పందించి పది కోట్ల వరకు ఆర్థిక సాయం అందించారు. అయితే, ఆఖరి అడుగులో లక్ష్యం చేరుకోవడం కష్టతరమవుతున్న సమయంలో, విషయం తెలుసుకున్న లోకేష్ వెంటనే స్పందించారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, ఆరు కోట్ల రూపాయల భారీ నిధిని సమకూర్చేందుకు రెడీ అయ్యారు. ఇంజెక్షన్‌ను వీలైనంత త్వరగా తెప్పించి చిన్నారికి అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. నారా లోకేష్‌పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఒక తండ్రిగా ఆ తల్లిదండ్రుల వేదనను అర్థం చేసుకుని, రాజకీయం కంటే మానవత్వం గొప్పదని నిరూపించారు అంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు. క్లిష్ట సమయాల్లో ఇలాంటి వేగవంతమైన స్పందన ఒక నాయకుడికి ఉండాల్సిన అసలైన లక్షణమని పలువురు అభినందించారు. పునర్విక ప్రాణాలను నిలిపేందుకు ఆయన చూపిస్తున్న ఈ చిత్తశుద్ధి ఎందరో బాధితుల్లో కొత్త ఆశలను నింపుతోంది.

సాధారణంగా ఇలాంటి ఖరీదైన చికిత్సల విషయంలో ప్రభుత్వాలు లేదా నాయకులు సాంకేతిక కారణాలు చెప్పి దాటవేయడం చూస్తుంటాం. కానీ, లోకేష్ స్వయంగా బాధ్యత తీసుకోవడం ఆయనలోని సేవా దృక్పథానికి నిదర్శనం. ఆరు కోట్లు అనేది సామాన్యం కాదు, కానీ ఒక ప్రాణాన్ని నిలబెట్టాలనే ఆయన సంకల్పం ముందు ఆ అంకె చిన్నబోయింది. ఈ స్పందన కేవలం ఆ కుటుంబానికే కాదు, ఏపీ ప్రజలకు లోకేష్‌పై ఉన్న నమ్మకాన్ని మరింత రెట్టింపు చేసిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos