ఏపీ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా రాజకీయ ప్రముఖులు, తెలుగుదేశం పార్టీ శ్రేణుల నుండి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. లోకేష్ పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు తమ తమ నియోజకవర్గాలలో బర్త్ డే సెలబ్రేషన్స్ చేస్తున్నారు. ఇదే సమయంలో మంత్రి నారా లోకేష్ కు తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి ... పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా లోకేష్ పట్ల తమ ప్రేమని వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టారు.
మన రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు పెట్టుబడుల కోసం దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొంటున్న నీకు నా ఆశీస్సులు ఉంటాయి అని ఆమె పేర్కొన్నారు. ఈ ఏడాది కూడా నీకు విజయం, అంతులేని ఆనందంతో నిండి ఉండాలని కోరుకుంటున్నానని ఆల్ ది బెస్ట్ నాన్న అంటూ భువనేశ్వరి ట్వీట్ చేశారు. ఇక లోకేష్ తో కలిసి దిగిన ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
అలాగే బ్రాహ్మణి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నాపై మీ ప్రేమ అంకితభావానికి కృతజ్ఞురాలిని అని పేర్కొన్న బ్రాహ్మణి మీరు చేసే ప్రతిపనికి నేను చాలా గర్వపడుతున్నాను. ముఖ్యంగా ఈరోజు మీరు వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మన రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు ఈ సంవత్సరం కూడా మీకు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్ డే లవ్ ఆఫ్ మై లైఫ్ అని బ్రాహ్మణి పోస్ట్ చేశారు.
ఇక లోకేష్ పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు మంత్రులు నేతలు పెద్ద ఎత్తున ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక మరోవైపు దావోస్ పర్యటనలో లోకేష్ దూసుకుపోతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా లోకేష్ వివిధ రంగాల ప్రముఖులతో భేటీ అయ్యి చర్చలు జరుపుతున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టవలసిందిగా ప్రముఖ కంపెనీల ప్రతినిధులను లోకేష్ కోరుతున్నారు. పుట్టినరోజు రోజున కూడా లోకేష్ వివిధ కంపెనీల ప్రతినిధులతో భేటీ అవుతూ బిజీ బిజీగా ఉన్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos