టీడీపీ మహానాడు వేదికగా కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. రెండో రోజు మహానాడులో భాగంగా పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు మరో సారి ఎన్నిక కానున్నారు. ఇదే సమయంలో పార్టీ ముఖ్య నేత లు మహానాడు వేదికగా కొత్త డిమాండ్ చంద్రబాబు ముందు ఉంచారు. నారా లోకేష్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించాలని సీనియర్లు ప్రతిపాదించారు. ఇక, ఇప్పుడు మహానాడు వేదికగా చంద్రబాబు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారనేది ఆసక్తికరంగా మారుతోంది.

లోకేష్ కు పార్టీలో .. ప్రభుత్వంలో ప్రమోషన్ ఇవ్వాలనే డిమాండ్ కొంతకాలంగా వినిపిస్తోంది. అందులో భాగంగా పార్టీ మహానాడు వేదికగా పార్టీ సీనియర్లు తమ మనసులో మాట బయట పెట్టారు. చంద్రబాబు వద్ద లోకేష్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు కేటాయించాలని ప్రతిపాదించారు. మహానాడు వేదికగా పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర ప్రతిపాదించారు. నారా లోకేశ్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని తాము మినీ మహానాడులో తీర్మానించామని వెల్లడించారు. పార్టీలోని వారంతా కోరుకుంటున్న విధంగా నారా లోకేశ్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని సీఎం చంద్రబాబుకు ధూళిపాళ నరేంద్ర విజ్ఞప్తి చేశారు.

మంత్రి నారా లోకేశ్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టాలని తెలుగుదేశం పార్టీలో ఇప్పటికే పలువురు నేతలు  డిమాండ్ చేస్తున్నారు. సీనియర్ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితోపాటు పలువురు నేతలు ఇదే విషయాన్ని బుధవారం మహానాడు వేదికగా స్పష్టం చేశారు. ఈ రోజు పార్టీ జాతీయ అధ్యక్ష్యుడిగా మరోసారి సీఎం చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. ఆ క్రమంలో నారా లోకేశ్‌ను సైతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎంపిక చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఇదే వేదిక నుంచి చంద్రబాబు కీలక ప్రసంగం చేసారు. రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం చేసే బాధ్యత తమదే అని చంద్రబాబు వెల్లడించారు. 43 ఏళ్లుగా టీడీపీ జెండా రెపరెపలాడుతుందంటే కార్యకర్తలే కారణమని చెప్పుకొచ్చారు.

కార్యకర్తలే సుప్రీం అనేది పార్టీ సిద్దాంతంగా చంద్రబాబు పేర్కొన్నారు. 2047కు తెలుగుజాతిని ప్రపంచంలోనే ప్రథమస్థానంలో ఉంచాలనేది లక్ష్యంగా వెల్లడించారు. రాబోయే 40 ఏళ్లకు రోడ్‌ మ్యాప్‌నకు రూపకల్పన చేసుకున్నామని వివరించారు. తెలుగు కుటుంబం కోసం ఆరు శాసనాలు చేసుకున్నామని చెప్పారు. 45 రోజుల్లో కోటికి పైగా సభ్యత్వం నమోదు చేసిన ఏకైక పార్టీ టీడీపీ అని చంద్రబాబు పేర్కొన్నారు. తొలిసారి అసెంబ్లీకి 65 మంది యువతకు సీట్లు ఇచ్చిన చరిత్ర టీడీపీదని వెల్లడించారు. నీతి నిజాయతీ, పట్టుదల ఎన్టీఆర్‌ ఆయుధాలుగా వ్యవహరించారని చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ రూపొందించిన పసుపు జెండా శాశ్వతంగా ఉంటుందని సీఎం చంద్రబాబు వివరించారు. సాయంత్రం మహానాడులో టీడీపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక, ప్రమాణ వీకారం ఉండనుందని సీనియర్ నేతలు చెబుతున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos