టీడీపీకి మహానాడు అనేది ప్రాణ ప్రదం. ఈ విషయంలో ఎలాంటి తేడా లేదు. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు అనేక సంస్కరణలకు పెద్దపీట వేసిన పార్టీలో మహానాడుకు అత్యంత ప్రాధాన్యం ఉంది. ఒక్కోసారి ఒక్కో ప్రాంతంలో నిర్వహిస్తున్న మహానాడు మహోత్సవాన్ని ఈసారి రాష్ట్రంలోని చాలా కీలక ప్రాంతంలో నిర్వహించబోతున్నారు.  అది ఎక్కడో కాదు కడప జిల్లాలోనే. అందులోనూ .. వైసీపీ అధినేత జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలోనే మహానాడును నిర్వహించాలని నిర్ణయించారు. అయితే.. వేదికపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలావుంటే.. కడప జిల్లాలో ఎక్కడ నిర్వహించినా.. మహానాడు ఒక చరిత్ర  సృష్టించినట్లే అవుతుంది. 45 సంవత్సరాల పార్టీ చరిత్రలో తొలిసారి కడపలో నిర్వహిస్తుండడం ఇదే తొలిసారి. అంతేకాదు.. ఈ వేదికగా.. పార్టీకి భవితవ్యాన్ని మరింత గట్టిగా తీర్చిదిద్దే ఉద్దేశం కూడా కనిపిస్తోంది. ఈసారి జరగబోయే మహానాడు వేదికగానే.. నారా లోకేష్‌కు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం జాతీయ ప్రధాన కార్యదర్శిగా టీడీపీని బలంగా ముందుకు తీసుకువెళ్తున్న నారా లోకేష్‌కు కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని క్రియేట్ చేసి ఇస్తారని.. పార్టీలో అత్యంత సీనియర్ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. నిజానికి నాలుగేళ్ల కిందట కూడా ఇదే మాట వినిపించింది. కానీ, అప్పట్లో సాకారం కాలేదు. ఈ దఫా ఖాయమని తెలుస్తోంది.

అదే సమయంలో పాతతరం నాయకులను పక్కన పెట్టి యువ తరానికి పగ్గాలు అప్పగించే విషయంపైనా మహానాడు వేదికగా మారనుందని తెలుస్తోంది. నారా లోకేష్ ఇటీవల కాలంలో చెబుతున్నట్టు 33 శాతం మంది యువతకు అవకాశం కల్పిస్తామన్న విషయం ఈ వేదిక నుంచే సాకారం అయ్యే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. అదే సమయంలో పార్టీ భవితవ్యం.. 2047 వరకు అధికారంలో కొనసాగేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను కూడా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ నాయకులు చెబుతున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos