మంగళగిరిః నియోజకవర్గాన్ని తన గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటానని, ప్రజలు తనపై పెట్టిన బాధ్యతను తూచా తప్పకుండా నెరవేరుస్తానని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. మంగళగిరి పట్టణంలో బాప్టిస్టుపేట, ఏపీఎస్పీ 6వ బెటాలియన్ క్యాంప్ లో ఏర్పాటుచేసిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో మంత్రి లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొని సందడి చేశారు. బాప్టిస్టుపేట యూత్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 45 అడుగుల అతిపెద్ద క్రిస్మస్ స్టార్ ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేసి.. అనంతరం కేక్ కట్ చేశారు. క్రైస్తవ సోదరులకు మంత్రి లోకేష్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. క్రిస్మస్ అంటే మనదగ్గర ఉంది లేనివాళ్లకు ఇవ్వడం.. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం. 2019లో 21 రోజుల ముందు మంగళగిరి నియోజకవర్గానికి వచ్చా. నేనేంటో మీకు తెలియదు. మీరేంటో నాకు తెలియదు. ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయాను. తర్వాత ఎక్కడికీ వెళ్లకుండా కసితో పనిచేశా. 2024 ఎన్నికల్లో భారీ మెజార్టీతో ప్రజలు నన్ను ఆశీర్వదించారు. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కో కష్టం పెడతాడు. పరీక్షను జయించే శక్తి కూడా ఇస్తాడు. నేను 5 ఏళ్లు కష్టపడ్డా. నాపై అక్రమంగా 23 కేసులు పెట్టారు. 226 రోజుల పాటు 3,132 కి.మీల పాదయాత్ర చేశా. ఇప్పుడున్న తరం చిన్న ఎగ్జామ్ ఫెయిల్ అయితేనే ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. అందరూ ధైర్యంగా ఉండాలి. ఏసుప్రభు అందరం కలిసిమెలిసి ఉండాలని చెప్పారు. కష్టాల్లో ఉన్నవారిని వ్యక్తిగతంగా ఆదుకోవాలి. కలిసికట్టుగా ఉంటే సమాజంలో విప్లవం వస్తుంది. 2024 ఎన్నికల్లో అది చూశామన్నారు.
యుద్ధప్రాతిపదికన ఇళ్ల పట్టాల మంజూరు...
గత 6 నెలల కాలంలో మంగళగిరి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. యుద్ధప్రాతిపదికన ఇళ్ల పట్టాలు మంజూరూ చేస్తాం. ఇప్పటికే పనులు ప్రారంభించడం జరిగింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీరు అందించడంతో పాటు అండర్ గ్రౌండ్ పవర్, గ్యాస్ అందిస్తాం. కమ్యూనిటీ భవన నిర్మాణ పనులు చేపడతాం. నియోజకవర్గవ్యాప్తంగా 85 పార్కులను అభివృద్ధి చేస్తాం. ఇప్పటికే అందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాం. అన్నీ క్రమపద్ధతిలో చేస్తాం. గత ఎన్నికల్లో నాకు అండగా నిలబడ్డారు. అందువల్లే కేబినెట్ లో మంగళగిరి నియోజకవర్గం గురించి పోరాడగలుగుతున్నా. ఇప్పటికే వంద పడకల ఆసుపత్రి మంజూరు చేయడం జరిగింది. నియోజకవర్గంలో అనేక కంపెనీలు రాబోతున్నాయి. యువతకు స్థానికంగానే ఉద్యోగాలు కల్పిస్తామని లోకేష్ వెల్లడించారు.
ఆంధ్రరాష్ట్ర పోలీసులకు పూర్వవైభవం తీసుకువస్తాం..
ఏపీఎస్పీ 6వ బెటాలియన్ క్యాంప్ లో ఏర్పాటుచేసిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. 1995లో ఆంధ్రరాష్ట్ర పోలీసులు నెం.1గా ఉండేవారు. గడచిన ఐదేళ్లలో గత ప్రభుత్వం పోలీసు వ్యవస్థను వ్యక్తిగత కక్ష సాధింపు కోసం వాడుకున్నారు. నాపై అక్రమంగా 23 కేసులు నమోదు చేశారు. ఆంధ్రరాష్ట్ర పోలీసులకు పూర్వవైభవం తీసుకురావాల్సిన బాధ్యత అందరిపై ఉంది. మన బెటాలియన్ రాజధానిలో ఉంది. రాబోయే రోజుల్లో మన బెటాలియన్ కీలకపాత్ర పోషిస్తుంది. పోలీసులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరిస్తామని, గత ప్రభుత్వ పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని మంత్రి లోకేష్ తెలిపారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos