ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ అరాచక, అవినీతి పాలనను పూర్తిగా రూపుమాపి... రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా.. విద్యామంత్రిగా నారా లోకేష్.. సైలెంట్ గా తాను చేయాలనుకున్న మార్పులను చేస్తున్నారు. విద్యార్థులను , టీచర్లను రాజకీయాలకు దూరంగా ఉంచాలన్న లక్ష్యంతో ఆయన పెద్దగా ప్రచారం చేసుకోవడం లేదు. ప్రభుత్వ స్కూళ్లలో చదివే వారంతా పేద పిల్లలే. వారి భవిష్యత్తు తీర్చిదిద్దడానికి అవసరమైన చర్యలు చేపడుతున్నారు. పబ్లిసిటీ కన్నా వారి జీవితాలు బాగుండాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.

గత వైసీపీ ప్రభుత్వం ఏ మాత్రం కసరత్తు చేయకుండా ఐబీ అని.. సీబీఎఎస్‌ఈ అని.. ఇంగ్లిష్ మీడియం అని విద్యార్థులపై రుద్దేసింది. ఫలితంగా అనేకమంది విద్యార్థులు చదువు మధ్యలోనే ఆపేసే పరిస్థితి వచ్చింది. దీని ఫలితంగా ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పడిపోయింది. ఆ పరిస్థితిని మార్చడానికి లోకేష్ ప్రయత్నిస్తున్నారు. విద్యార్థులపై ఇంగ్లిష్ ఒకేసారి రుద్దకుండా…క్రమంగా నేర్పిస్తూ వెళ్లాలని నిర్ణయించారు. అలాగే సిలబస్ లో కూడా కీలకమైన మార్పులు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా.. వైఎస్ జగన్ ప్రభుత్వం ఆపేసిన ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకాన్ని పునరుద్ధరించారు.

విద్యావ్యవస్థను రాజకీయానికి దూరంగా ఉంచాలని లోకేష్ లక్ష్యంగా పెట్టుకున్నారు. గత ప్రభుత్వం పూర్తిగా రాజకీయమే చేసింది. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంది. ఒక్క టీచర్ ను కూడా నియమించలేదు. పైగా నాడు – నేడు పేరుతో బల్లలు, రంగుల కోసం వేల కోట్లు ఖర్చు పెట్టి అవినీతి చేశారు కానీ.. సౌకర్యాలు మెరుగుపడింది లేదు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన లోకేష్.. ఖచ్చితమైన మార్పులు చూపించే దిశగా అడుగులు వేస్తుండటంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందని  రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos