ఏపీలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీ మంత్రి నారా లోకేష్ రేపు శనివారం ఢిల్లీ వెళ్లనున్నారు. అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న లోకేష్ కు ప్రధాని అప్పాయింట్ మెంట్ ఖరారైనట్లు సమాచారం రావటంతో వెంటనే హైదరాబాద్ చేరుకుంటున్నారు. రేపు కుటుంబసభ్యులతో కలిసి ఢిల్లీ వెళ్లనున్నారు. ఏపీ పర్యటనకు వచ్చిన సమయంలో ప్రధాని మోదీ తనను కలవాల్సిందిగా లోకేష్ కు సూచించారు. తాజాగా ఆపరేషన్ సింధూర్ తరువాత లోకేష్ అప్పాయింట్ మెంట్ కోరారు.  కాగా, రేపు ఈ మేరకు లోకేష్ కు అప్పాయింట్ మెంట్ ఖరారైంది. ఈ పర్యటన సమయంలో ఆపరేషన్ సింధూర్ తరువాత ప్రజల మూడ్.. ఎన్డీఏ పాలన.. ఏపీలో ఏడాది కూటమి పాలన గురించి చర్చించే అవకాశం ఉంది. అదే విధంగా ఆపరేషన్ సింధూర్ పైన ప్రధానికి ఏపీ తరపున అభినందనలు తెలపనున్నారు.

లోకేష్ కు పార్టీలో - ప్రభుత్వంలో ప్రమోషన్ గురించి చర్చ జరుగుతోంది. కొద్ది నెలల క్రితం పవన్ తో సమానంగా లోకేష్ కు డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలని టీడీపీ నేతలు ఓపెన్ గా చేసిన వ్యాఖ్య లు రాజకీయంగా చర్చగా మారాయి. పవన్ అభిమానులు ఈ ప్రతిపాదన పైన ఘాటుగా స్పందిస్తూ పోస్టింగ్స్ పెట్టటంతో వివాదంగా మారింది. ఆ తరువాత ఈ వ్యవహారం పైన ఎవరూ మాట్లాడవద్దని టీడీపీ అధినాయకత్వం ఆదేశించటంతో వివాదం ముగిసింది. ఇక, ఈ నెల 27వ తేదీ నుంచి మూడు రోజుల పాటు కడప జిల్లా కమలాపురం నియోజకవర్గ పరిధిలో టీడీపీ మహానాడు జరగ నుంది. ఇందు కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమయంలోనే ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలంటూ తీర్మానం ప్రతిపాదించ.. ఆమోదించే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం.

లోకేష్ ఇప్పటికే ప్రభుత్వంలో దాదాపు నెంబర్ టూ స్థానంలో ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీలోనూ సీట్ల ఖరారు.. మంత్రివర్గ కూర్పు.. ప్రస్తుతం నామినేటెడ్ పదవుల విషయంలోనూ లోకేష్ పాత్ర కీలకంగా మారిందని పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో.. పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి గురించి మహానాడు వేదికగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. పార్టీ పదవుల విషయంలోనూ ఎవరూ రెండు సార్లు కంటే ఎక్కువగా ఒకే పదవి లో కొనసాగకూడదనే లోకేష్ ప్రతిపాదనకు పార్టీ పాలిట్ బ్యూరో ఆమోద ముద్ర వేసింది. దీంతో, ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధానితో భేటీ.. పార్టీ మహానాడులో లోకేష్ పదవి పైన జరిగే నిర్ణయాల పైన టీడీపీలో ఆసక్తి కర చర్చ సాగుతోంది. ఏం జరుగుతుందో మరి చూడాలి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos