బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావం వల్ల ఈ నెల 24వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశమున్నట్లు తెలిపింది.
ఏపీలో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశమున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, అల్లూరి సీతారామరాజు, నెల్లూరు, తిరుపతి, కడప, అనంతపురం, కర్నూలులో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు.
అదేవిధంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. మిగిలిన ప్రాంతాల్లోనూ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతాయని అధికారులు సూచించారు. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీసే అవకాశం ఉందన్నారు. ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్, నల్గొండ, కరీంనగర్, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos