ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడిందని, ఇది వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా తీరంవైపు చేరే అవకాశాలున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ఆ తర్వాత ఉత్తరం వైపుగా పయనించి ఏపీ తీరం వెంబడి వెళ్లే అవకాశం ఉందని, దీని ప్రభావంతో ఈ రోజు, రేపు అంటే శుక్ర, శనివారాల్లో విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం,శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

అదేవిధంగా అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి పుట్టపర్తి, కడప, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఈ సమయంలో సముద్ర తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల ఈదురు గాలులు వీస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లొద్దని  హెచ్చరికలు జారీ చేశారు. మరో రెండురోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. 

ఇటీవలి కాలంలో బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వరుస అల్పపీడనాల కారణంగా ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.  ఫెంగల్ తుపాను కారణంగా పలు జిల్లాలలో పంట నష్టం కూడా సంభవించింది. రాయలసీమ జిల్లాలలో ఎక్కువగా వర్షాలు పడుతుండటంతో పలు ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. తిరుమల కొండపైన ఉన్న ఐదు రిజర్వాయర్లు కూడా పూర్తిగా నీటితో నిండిపోవడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos