కాంగ్రెస్ నాయకత్వానికి రెండు రాష్ట్రాల ఎన్నికలు సమర్థతకు పరీక్షగా మారాయి. హర్యానాలో ఖాయమని భావించిన అధికారం చేజారింది. జమ్ము కాశ్మీర్ ఫలితాలు ఆశించిన స్థాయిలో లేవు. దీంతో, ఇప్పుడు మహారాష్ట్ర .. జార్ఖండ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆచి తూచి వ్యవహరిస్తోంది. సీట్ల ఖరారు లో మిత్రపక్షాలతో తగ్గి మంతనాలు సాగిస్తోంది. బీజేపీ పైన నెగ్గటం కోసం అవసరమైతే తమ సీట్లు తగ్గించుకోవటానికి సిద్దమైంది. తాజాగా రెండు రాష్ట్రాల పార్టీ నాయకత్వానికి రాహుల్ సీట్ల ఖరారు పైన మార్గనిర్దేశం చేసారు.

మహారాష్ట్ర, జార్ఖండ్ లలో అభ్యర్ధుల ప్రకటన ప్రక్రియ మొదలైంది. రెండు కూటములు మిత్రపక్ష పార్టీలతో సీట్ల సర్దుబాటు పైన కసరత్తు చేస్తున్నాయి. ఒప్పందం కుదిరిన నియోజకవర్గాల్లో తమ అభ్యర్ధులను ప్రకటిస్తున్నాయి. మిత్రపక్షాలు సీట్ల కోసం రెండు కూటముల్లోనూ కాంగ్రెస్ - బీజేపీ పైన ఒత్తిడి పెంచుతున్నాయి. హర్యానా ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ లో మార్పు తెచ్చాయి. మహారాష్ట్రలో కాంగ్రెస్ నాయకత్వం 125 సీట్లలో పోటీ చేయాలని తొలుత భావించింది. రాష్ట్ర పార్టీ నేతలు ఇందుకు సిద్దమయ్యారు. అయితే, ఇప్పుడు కాంగ్రెస్ ఆ సంఖ్య ను 10 5- 110 కి పరిమితం కావాలని నిర్ణయించింది. మిత్రపక్షాలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ అయింది. మిత్రపక్షాలకు సానుకూల సంకేతం పంపేందుకు కాంగ్రెస్ తమ సీట్లను తగ్గించుకుంటోంది.

అదే విధంగా జార్ఖండ్ లో కాంగ్రెస్ 2019 ఎన్నికల్లో 31 సీట్లలో పోటీ చేసింది. తాజాగా 33 సీట్లలో పోటీకి కసరత్తు చేసింది. అయితే, మిత్రపక్షాల నుంచి సీట్ల కోసం వస్తున్న ఒత్తిడితో ఇప్పుడు 29 సీట్లలో పోటీకి కాంగ్రెస్ సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. జార్ఖండ్ లో ఇండియా కూటమిలో ప్రధాన పార్టీగా ఉన్న జేఎంఎం 45 స్థానాల్లో పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. 2019లో ఏడు స్థానాల్లో పోటీ చేసిన ఆర్జేడీ తిరిగి అదే సంఖ్య కు పరిమితం అయ్యే ఛాన్స్ ఉంది. దీంతో, సీట్ల విషయంలో నేరుగా రాహుల్ మిత్రపక్షాలతో చర్చలు చేస్తున్నారు.

జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్ తోను, మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రేతోనూ రాహుల్ చర్చలు జరిగాయి. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో కాంగ్రెస్ బలంగా ఉండటంతో ఆక్కడ కాంగ్రెస్ ఎక్కువ సీట్లలో పోటీ చేయాలని భావిస్తోంది. మిత్రపక్షాలకు ప్రాధాన్యత ఇస్తూనే..తాము బలంగా ఉన్న స్థానాల్లో మాత్రం పోటీ చేయాలని డిసైడ్ అయింది. మహారాష్ట్రలో రేపు కాంగ్రెస్ కూటమి పోటీ చేసే స్థానాల పైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. స్థానికంగా మిత్ర పక్షాలకు ప్రాధాన్యత ఇస్తూ.. బీజేపీ కూటమి ఓటమే లక్ష్యంగా పని చేయాలని రాహుల్ గాంధీ సూచిస్తున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos