విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో సోమవారం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ప్లాంట్‌లోని మెటల్ లిక్విడ్ లాడిల్ పేలడంతో ఒక్కసారిగా భారీ శబ్దంతో మంటలు ఎగసిపడ్డాయి. ఈ ఘటనతో ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రమాదం జరిగిన సమయంలో విధుల్లో ఉన్న కార్మికులు, ఉద్యోగులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఘటనలో పలువురు కార్మికులు గాయపడినట్లు సమాచారం. ప్రమాద తీవ్రత కారణంగా మృతుల సంఖ్యపై కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే దీనిపై అధికారిక వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై స్టీల్‌ప్లాంట్ అధికారులు, సంబంధిత విభాగాలు విచారణ చేపట్టాయి. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos