ఆంధ్రప్రదేశ్ లోని మార్కాపురం జిల్లాలో రాయవరం సమీపంలో పలకల క్వారీల వద్ద టిప్పర్‌ను ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు మృతుల సంఖ్య 14 కు చేరింది . ప్రమాదంలో బస్సులోని 13 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. వారి మృతదేహాలను వెలికితీశారు. మరో 28 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండగా, ఒకరు మృతి చెందారు. క్షతగాత్రులను మార్కాపురంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు తెలంగాణలోని నిర్మల్ నుంచి నెల్లూరు జిల్లా కలిగిరికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన సమయంలో బస్సులో 41 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోని మార్కాపురం జిల్లాలో జరిగిన ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. 14 మంది సజీవ దహనం కావటం అత్యంత విషాదకరమన్నారు. క్లిష్ట సమయంలో బాధిత ప్రజలు, వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానన్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50 వేల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి బాబు కూడా మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

బస్సు ప్రమాద ఘటనపై ఏపీ క్యాబినెట్ లో చర్చ జరగగా మృతులకు మంత్రివర్గం సంతాపం తెలిపింది. బాధిత కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఐదు లక్షలు గాయపడిన వారికి రెండు లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారు. బాధితులకు అందుతున్న వైద్యాన్ని కూడా పర్యవేక్షించాలని మంత్రులు అధికారులకు సూచించారు. ఇదిలా ఉంటే తెలంగాణ రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బస్సు ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ మార్కాపురం బ‌స్సు ప్ర‌మాద ఘ‌ట‌న‌పై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసి, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos