భారత చెస్ ప్లేయర్, ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి.. ఫిడే మహిళల చెస్ వరల్డ్ కప్ సెమీఫైనల్ చేరిన తొలి భారత క్రీడాకారిణిగా నిలిచారు. క్వార్టర్ ఫైనల్లో 1.5-0.5 పాయింట్ల తేడాతో చైనా ప్లేయర్ యుక్సిన్ సాంగ్ పై తెలుగు తేజం కోనేరు హంపి విజయం సాధించి FIDE Womens World Cup సెమీఫైనల్లోకి దూసెకెళ్లారు. శనివారం జరిగిన తొలి గేమ్ లో గెలిచిన కోనేరు హంపి, నిన్న జరిగిన రెండో గేమ్ డ్రా చేసుకున్నారు. సెమీఫైనల్లో కోనేరు హంపి చైనా ప్లేయర్, టాప్ సీడ్ లీ టింజీతో తలపడతారు. మరోవైపు మరో క్వార్టర్ ఫైనల్లో 2-0తో జార్జియాకు చెందిన ననా జాగ్నిజెపై లీ టింజీ విజయం సాధించింది. గత ఏడాది ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా హంపి నిలిచారు.

ఫిడే ఉమెన్స్ వరల్డ్ కప్ సెమీ ఫైనల్ కు చేరిన గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపికి నా ప్రత్యేక అభినందనలు. ఈ వరల్డ్ కప్ లో సెమీఫైనల్స్ చేరిన తొలి భారతీయ మహిళ కోనేరు హంపి కావడం తెలుగు ప్రజలకు గర్వకారణం. హంపి విజయం సాధించాలని మనసారా కోరుకుంటున్నానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 

"మన తెలుగు కుమార్తె ప్రపంచ వేదికపై కాంతులు విరజిమ్ముతోంది. గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపీ ఫిడే వరల్డ్ కప్ సెమీఫైనల్స్‌కు చేరుకున్న తొలి భారత మహిళగా నిలిచినందుకు అభినందనలు. నీ ఘనత దేశవ్యాప్తంగా మమ్మల్ని గర్వించేలా చేస్తోంది. ఈ విజయం అసంఖ్యాకంగా ఇతరులకు స్ఫూర్తినిస్తోంది. చెస్ బోర్డుపై నీవు మరిన్ని విజయాలతో ప్రభావవంతంగా రాణించాలని కోరుకుంటున్నాం అమ్మా!"... అంటూ ఏపీ సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.

"భారత చెస్‌కు చారిత్రక మైలురాయి ఇది.! గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపీ ఫిడే మహిళల వరల్డ్ కప్ సెమీఫైనల్స్‌కు చేరుకున్న తొలి భారత మహిళగా నిలిచినందుకు హృదయపూర్వక అభినందనలు. ఐఎం యుక్సిన్ సాంగ్‌పై ఆమె ప్రదర్శించిన అద్భుతమైన కౌంటర్‌ అటాకింగ్ ఆటతీరు ఆమె ఓర్పు, నైపుణ్యం, వ్యూహాత్మక పటిమను చాటింది. ఇది కేవలం వ్యక్తిగత విజయం మాత్రమే కాదు, భారత చెస్‌కు గర్వకారణం మరియు దేశవ్యాప్తంగా యువ ఆటగాళ్లకు స్ఫూర్తి ప్రదాత. సెమీఫైనల్స్‌లో ఆమె మరింత రాణించి, టైటిల్‌ను సొంతం చేసుకోవాలని శుభాకాంక్షలు!"... అంటూ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Take Oath As A TDP National Working President | CM Chandrababu | AG

తాజా వార్తలు

Related Videos