ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎన్నికల్లో ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన హామీ ఇచ్చింది. రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్దితి గమనించి ఇచ్చిన ఈ హామీని నిలబెట్టుకోవడానికి ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటూ ముందుకెళ్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు వరుసగా జాబ్ మేళాల నిర్వహణకు సిద్దమవుతోంది. ఇందులో భాగంగా ఏపీ విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ తన నియోజకవర్గం మంగళగిరి నుంచే వీటిని ప్రారంభిస్తున్నారు.

ఈ నెల 24న అంటే వచ్చే ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మంగళగిరిలోని వీటీజేఎం-ఐవీటీఆర్ డిగ్రీ కాలేజీ ప్రాంగణంలో జాబ్ మేళా జరగనుంది. ఈ జాబ్ మేళాకు కనీస విద్యార్హత ఏదీ లేదు. జీరో నుంచి పీజీ వరకూ ఏ అర్హత ఉన్నా ఇందులో హాజరు కావచ్చని నిర్వాహకులు పేర్కొన్నారు. 50కి పైగా కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్నాయని, ఐదు వేలకు పైగా ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని ఓ ప్రకటన విడుదల చేశారు.

మంగళరిలో నిర్వహించే ఈ మెగా జాబ్ మేళాలో పాల్గొనదలిచిన వారికి ఇతర వివరాలు అందించేందుకు హెల్ప్ లైన్ నంబర్లను, రిజిస్ట్రేషన్ల కోసం క్యూఆర్ కోడ్ ను కూడా షేర్ చేశారు. అభ్యర్ధుల కోసం హెల్ప్ లైన్ నంబర్లు 9642333668, 9030047303ను అంందుబాటులో ఉంచారు. అలాగే కంపెనీల హెచ్ ఆర్ కోసం మరో హెల్ప్ లైన్ నంబర్ 8886111981ను కూడా అందుబాటులో ఉంచారు. రిజిస్ట్రేషన్ల కోసం గూగుల్ డాక్స్ ఫామ్ ను, క్యూఆర్ కోడ్ తో అంందుబాటులో ఉంచారు. కాబట్టి మంగళగిరి, చుట్టు పక్కల ఉన్న నిరుద్యోగులే కాకుండా రాష్ట్రంలోని ఏ ప్రాంత నిరుద్యోగులైనా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos