రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం నేడు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0 కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 45 వేల ప్రభుత్వ, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఈ క్రమంలోనే పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గంలోని భామిని మోడల్ స్కూల్‌లో.. జరిగిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ హాజరయ్యారు. ఈ మీటింగ్ కి విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
పాఠశాలకు వెళ్లిన సీఎం చంద్రబాబు తొలుత నేరుగా విద్యార్థుల తరగతులను పరిశీలించారు. తర్వాత విద్యార్థులతోపాటు క్లాస్ రూములో కాసేపు కూర్చొని డిజిటల్ పాఠాలు ఉపాధ్యాయులు ఏ విధంగా బోధన చేస్తున్నారనేది తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కూర్చుని వారితో ముచ్చటించారు. అలానే వారి ప్రోగ్రెస్ కార్డులను కూడా పరిశీలించారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు నాయుడు తన చేతిలో ట్యాబ్ పట్టుకొని ఓ చిన్నారి వద్దకు తీసుకెళ్లారు. అందులో ఉన్న అంశాన్ని చదవాలని సూచించగా.. చిన్నారి చదివే ప్రయత్నం చేయడంతో ముఖ్యమంత్రి అభినందించారు. మరోవైపు పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ పాల్గొని విద్యార్థులతో మాట్లాడారు. ఈ బృహత్ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు పిల్లల జవాబు పత్రాలు, హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు తల్లిదండ్రులకు అందజేశారు. దీంతో పిల్లల చదువులు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకునే వీలుంటుందని విద్యాశాఖ అధికారులు పవన్ కళ్యాణ్ కు వివరించారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos