ఏపీలోని నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు సమీపంలో భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్)‌ రూ.96,862 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్‌ రిఫైనరీ, పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు కానుంది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ బీద మస్తాన్‌రావు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయమంత్రి అనుప్రియ పటేల్‌ ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. 6 వేల ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ రిఫైనరీ ద్వారా ఏటా 9-12 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి చేయొచ్చని... ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆమోదం తెలిపిందని.. పెట్టుబడి వ్యయంలో 75% మొత్తాన్ని ప్రోత్సాహకాల రూపంలో వచ్చే 25 ఏళ్లలో చెల్లిస్తామని అన్నారు.

మరోవైపు విశాఖపట్నం ఉక్కు పరిశ్రమకు సంబంధించి కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ కీలక ప్రకటన చేశారు. విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌కు 2024 డిసెంబర్‌ 31 నాటికి రూ.38,965 కోట్ల అప్పు ఉన్నట్లు తెలిపారు. లోక్‌సభలో ఎంపీలు సీఎం రమేష్, వల్లభనేని బాలశౌరి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. 'గతేడాది ఏప్రిల్‌- డిసెంబర్‌ మధ్యకాలంలో రూ.12,615.03 కోట్ల ఆదాయం రాగా.. రూ.3,943.43 కోట్ల నష్టం వచ్చిందని... పలు రకాల సమస్యలను అధిగమించి సంస్థ యథాతథంగా నడవడానికే కేంద్రం మూలధనం సమకూరుస్తోందని మంత్రి తెలిపారు. కొబ్బరి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలో నాలుగో స్థానంలో ఉందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ తెలిపారు. లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో హిందూపురం టీడీపీ ఎంపీ బీకే పార్థసారథి ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. 'ఆంధ్రప్రదేశ్‌లో 1.07 లక్షల హెక్టార్లలో 11.81 లక్షల టన్నులపరంగా దిగుమతి రానుంది. కర్ణాటక, తమిళనాడు, కేరళ తర్వాత దేశంలో అత్యధిక పంట దిగుబడి ఏపీలోనే ఉందని, ఆంధ్రప్రదేశ్‌ రైతులు కొబ్బరి దిగుబడిలో కొత్త రికార్డు స్థాపించారని అన్నారు. అలాగే ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజనను ప్రతి పంటకూ విస్తరించాలని టీడీపీ పార్లమెంటరీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ను కోరారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos