ఆంధ్రప్రదేశ్‌లో రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి. జూన్ 19 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఉత్తరాంధ్రకు అనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. బంగ్లాదేశ్‌ నుంచి ఉత్తర బంగాళాఖాతం మీదుగా దక్షిణ ఒడిశా వరకు, మరాఠ్వాడా నుంచి తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు వేర్వేరు ఉపరితల ద్రోణులు ఏర్పడ్డాయని పేర్కొంది. ఈ ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ఇవాళ సోమవారం ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలలో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే ఉరుములు, మెరుపులతో పాటు 50 కి.మీ వరకు వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తీరప్రాంతాల్లో అధిక వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రేపటి నుంచి అంటే జూన్ 17 నుంచి 19 వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొనసాగుతాయని... రాయలసీమ, కోస్తాంధ్రలో ఈదురుగాలులు వీస్తాయని ఆ శాఖ తెలిపింది.

ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రజలకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక సూచన చేసింది. ద్రోణి ప్రభావంతో ఇవాళ సోమవారం రోజున శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, నంద్యాల, అనంతపురం,శ్రీసత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos