ఏపీలో ప్రస్తుతం అమలవుతున్న మధ్యాహ్న భోజనం నాణ్యత పెంచేందుకు వీలుగా ప్రభుత్వం ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 41 వేల పాఠశాలలు, నాలుగు వేల సంక్షేమ హాస్టళ్లలో ఈ నెల 12వ తేదీ నుంచే దీన్ని అమలు చేయబోతోంది. దీంతో మధ్యాహ్న భోజన పథకం రూపురేఖలు మారనున్నాయి. పాఠశాల విద్యార్థులకు రుచికరమైన, పౌష్టికాహార భోజనం అందించేందుకు సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇవాళ వెల్లడించారు. జూన్ 12వ తేదీ నుంచి స్కూళ్లు, హాస్టళ్లకు కలిపి మూడున్నర లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం సరఫరా చేస్తామని తెలిపారు. దీంతో మధ్యాహ్న భోజన పథకం అమలులో నాణ్యత పెరగబోతోంది.

మరోవైపు స్కూల్స్, హాస్టళ్లకు సరఫరా చేసే బియ్యం విషయంలో ప్రభుత్వం మరో నిర్ణయం కూడా తీసుకుంది. ఏ రైతు అయితే ఈ బియ్యం పండించారో, ఆయన చేతుల మీదుగానే పాఠశాలలు, సంక్షేమ హాస్టల్స్ కు బియ్యం పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. తద్వారా రైతులకి గౌరవం కల్పిస్తామన్నారు. దేశానికి వెన్నెముక రైతు అని, రైతు లేనిదే రాష్ట్రం లేదని, అటువంటి రైతాంగానికి అండగా నిలబడటం ప్రభుత్వంగా తమ బాధ్యత అని మంత్రి తెలిపారు.

మరోవైపు కూటమి విజయానికి ఏడాది పూర్తవుతున్న తరుణంలో ఈ నెల 4వ తేదీన జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. సుపరిపాలనకు ఏడాది పేరుతో ఉదయం మహిళలు రంగవల్లులు వేసి కూటమి విజయాన్ని పండగలా చేసుకుంటారన్నారు. పీడ విరగడై ఏడాది పేరుతో యువత సాయంత్రం దీపాలు వెలిగించి టపాకాయలు కాల్చి పండగ చేసుకుంటారన్నారు. ఈ పోస్టర్ ను నాదెండ్ల మనోహర్ విడుదల చేశారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos