అమరావతిః ప్రభుత్వ జూనియర్ కాలేజీలను ప్రైవేటు కాలేజీలకు ధీటుగా తీర్చిదిద్దుతామనే విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సంకల్పం కార్యరూపం దాలుస్తోంది. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ జూనియర్ కాలేజీల పనితీరులో గణనీయమైన మార్పు వచ్చింది. ఇంటర్మీడియట్ పరీక్షల్లో విద్యార్థులు సాధించిన ఫలితాలే ఇందుకు నిదర్శనం. గత పదేళ్లలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది ఇంటర్మీడియట్ ఫలితాల్లో విద్యార్థుల ఉత్తీర్ణతా శాతం గణనీయంగా పెరిగింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రమాణాల పెంపునకు మంత్రి నారా లోకేష్ తీసుకున్న చర్యలే ఇందుకు కారణం.


పదేళ్లలో ఎన్నడూలేని విధంగా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత శాతం పెరుగుదల

ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో గత పదేళ్లలో ఎన్నడూలేని విధంగా విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెరిగింది. ఇంటర్మీడియట్ రెండో ఏడాదిలో గత పదేళ్ల కంటే రికార్డు స్థాయిలో ఈ ఏడాది అత్యధికంగా 69 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్మీడియట్ మొదటి ఏడాది పరీక్షల్లో గత పదేళ్లతో పోలిస్తే రెండో అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఈ ఏడాది ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థుల్లో అత్యధికంగా 47 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ, ప్రైవేటు మొత్తంగా ఇంటర్మీడియట్ ఫలితాలు చూసుకుంటే గత పదేళ్లలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో ఇంటర్మీడియట్ మొదటి ఏడాదిలో అత్యధికంగా 70శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. రెండో ఏడాదిలో రికార్డు స్థాయిలో అత్యధికగా 83 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. జిల్లాల పరంగా చూసుకుంటే ఇంటర్మీడియట్ మొదటి ఏడాదిలో పార్వతీపురం మన్యం జిల్లాలో అత్యధికంగా 70శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అత్యల్పంగా విశాఖపట్నం జిల్లాలో 34శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇంటర్మీడియట్ రెండో ఏడాదిలో అత్యధికంగా పార్వతీపురం మన్యం జిల్లాలో 81 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. అత్యల్పంగా విశాఖపట్నం జిల్లాలో 55శాతం ఉత్తీర్ణత నమోదైంది.

ఇంటర్మీడియట్ ఒకేషనల్ లోనూ రికార్డు స్థాయిలో ఉత్తీర్ణత

ఇంటర్మీడియట్ ఒకేషనల్ లోనూ గత పదేళ్లతో పోలిస్తే రికార్డు స్థాయిలో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల విషయానికి వస్తే ఇంటర్మీడియట్ ఒకేషనల్ మొదటి ఏడాదిలో గత పదేళ్లలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో అత్యధికంగా 64శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్మీడియట్ ఒకేషనల్ రెండో ఏడాదిలో గత పదేళ్లలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో అత్యధికంగా 82శాతం ఉత్తీర్ణత నమోదైంది.

మంత్రి లోకేష్ చర్యలతో ప్రభుత్వ జూనియర్ కాలేజీల పనితీరులో గణనీయమైన మార్పు

విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ జూనియర్ కాలేజీల పనితీరులో గణనీయమైన మార్పు చోటుచేసుకుంది. ఫలితంగా రికార్డు స్థాయిలో ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణతా శాతం పెరిగింది. వైసీపీ హయాంలో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ రద్దు చేసింది.  నారా లోకేష్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పేరుతో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు అందించడం జరిగింది. అదేవిధంగా ఇంటర్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలుచేయడం జరిగింది. ఐదేళ్ల తర్వాత 2024 ఏడాదిలో 217 మంది ప్రిన్సిపల్స్ కు ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. 2024 ఏడాది అక్టోబర్ నుంచి సెంట్రలైజ్డ్ అసెస్ మెంట్ చేయడం జరిగింది. అంతర్గత పరీక్షల్లో విద్యార్థుల ఫలితాల ఆధారంగా ఉపాధ్యాయుల పనితీరును సమీక్షించడంతో పాటు విశ్లేషించడం జరిగింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల పనివేళలను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పెంచడం జరిగింది. వంద రోజుల కార్యక్రమాన్ని రూపొందించి వెనుకబడిన విద్యార్థులను కేటగిరీలుగా విభజించడంతో పాటు స్టడీ మెటీరియల్ అందించి వారికి వెన్నుదన్నుగా నిలవడం జరిగింది. మూడు పేరెంట్ టీచర్ మీటింగ్ ల నిర్వహణతో పాటు విద్యార్థులందరికీ ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వడం జరిగింది. జరుగుతున్న సిలబస్ పై వాట్సప్ గ్రూప్ ను ఏర్పాటుచేసి విద్యార్థుల తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించడం జరిగింది. టేక్ కేర్ వ్యవస్థను ఏర్పాటుచేసి విద్యార్థుల అభ్యసన ఫలితాలు, అటెండెన్స్ బాధ్యతలను అప్పగించడం జరిగింది. మంత్రి నారా లోకేష్ చొరవతో ఇంటర్ కాలేజీల్లో సంస్కరణలు తీసుకురావడం ద్వారా విద్యార్థుల ఉత్తీర్ణణ శాతం గణనీయంగా పెరిగింది.

 

 

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos