నేపాల్‌లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ వాసులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి ఐటీ, మానవ వనరుల అభివృద్ధి, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి నారా లోకేశ్ తక్షణ చర్యలు చేపట్టారు. సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కార్యాలయంలో ఆయన అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులు నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు ప్రజల సమాచారాన్ని మంత్రికి అందించారు.  ఈ సమీక్ష సమావేశంలో హోంమంత్రి అనిత, మంత్రులు కందుల దుర్గేష్, కొండపల్లి శ్రీనివాస్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వారు పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక విమానం ఇప్పటికే ఖాట్మండూ చేరుకుంది. ఖాట్మండూ నుంచి ఏపీ వాసులతో మధ్యాహ్నం 3 గం.లకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటుంది, అనంతరం తిరుపతి విమానాశ్రయానికి చేరుకోనుంది. అందుబాటులో ఉన్న కూటమి ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఆయా విమానాశ్రయాలకు వెళ్లి రాష్ట్ర వాసులను స్వాగతించాలని  మంత్రి లోకేష్ ఆదేశించారు.

విశాఖ, తిరుపతి విమానాశ్రయాలకు చేరుకున్న తరువాత బాధితులను తిరిగి వారి స్వస్థలాలకు చేర్చే బాధ్యతను కూటమి ఎమ్మెల్యేలకు మంత్రి లోకేష్ అప్పగించారు. అందుకు తగ్గ వాహనాలు, ఇతర సదుపాయాలు సమకూర్చాలని ఆయన ఆదేశించారు. వీలైనంత త్వరగా ఏపీ వాసులు రాష్ట్రానికి చేరుకునేలా చర్యలు తీసుకోవాలని, దీనికోసం విదేశాంగ శాఖ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరపాలని మంత్రి లోకేష్  ఆదేశించగా... ఇప్పటికే ఈ ప్రక్రియను ప్రారంభించామని అధికారులు మంత్రికి వివరించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos