కర్నూలు యువత పురోగతికి బాటలు వేసే ప్రాజెక్టు పైన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శుభవార్త చెప్పారు. కర్నూలు క్లస్టర్ యూనివర్సిటీకి సంబంధించిన పెండింగ్ పనులను రాబోయే విద్యా సంవత్సరంలోగా పూర్తి చేస్తామని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. శాసనసభలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానం ఇచ్చారు. ఈ ప్రకటన సుదీర్ఘకాలంగా నిలిచిపోయిన విద్య ప్రాజెక్టుపైన మళ్లీ ఆశలు రేకెత్తించింది.

రాష్ట్ర విభజన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కర్నూలులో సిల్వర్ జూబ్లీ, కేవీఆర్ విమెన్స్ డిగ్రీ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలను కలిపి క్లస్టర్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారని అయితే గత వైసీపీ ప్రభుత్వం ఈ క్లస్టర్ యూనివర్సిటీ ప్రాజెక్టును నిర్వీర్యం చేసిందని శాసనసభలో ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వం చేసిన పనులతో యూనివర్సిటీ నిర్మాణ పనులు నిలిచిపోయాయన్నారు. దీంతో యూనివర్సిటీ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ యూనివర్సిటీ కి సంబంధించి ప్రభుత్వ విధానాన్ని ప్రకటించాలని ఆమె శాసనసభ వేదికగా కోరారు. దీనికి సమాధానం ఇచ్చిన మంత్రి నారా లోకేష్ ఈ క్లస్టర్ యూనివర్సిటీ ప్రాజెక్ట్ కోసం గతంలోనే టీడీపీ ప్రభుత్వం 139 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని, రూసా పథకం కింద ఇప్పటికే 55 కోట్ల రూపాయలను ఖర్చు చేశామని మంత్రి లోకేష్ వెల్లడించారు. మిగిలిన పనుల పూర్తికి మరో 74.5 కోట్ల రూపాయల అవసరమని పేర్కొన్న ఆయన వీటిని వచ్చే విద్యా సంవత్సరంలోగా పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ప్రభుత్వం ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా క్లస్టర్ బేస్ అప్రోచ్ ని అనుసరిస్తుందని మంత్రి లోకేష్ శాసనసభ వేదికగా వెల్లడించారు. దీనికోసం వర్టికల్, హారిజంటల్ ఇంటిగ్రేషన్ అవసరమని అందుకు తగిన ఎకో సిస్టమ్ ను సృష్టించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కర్నూలు క్లస్టర్ యూనివర్సిటీ కోసం గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో సిల్వర్ జూబ్లీ కె.వి.ఆర్ ఉమెన్స్ డిగ్రీ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలను కలిపి క్లస్టర్ యూనివర్సిటీ గా ఏర్పాటు చేశారని ఆయన గుర్తు చేశారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos