మంగళగిరి ప్రీమియర్‌ లీగ్‌ (ఎంపీఎల్‌) సీజన్‌ – 4 క్రికెట్‌ పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. ప్రస్తుతం 27వ రోజుకు చేరుకున్న ఈ పోటీలకు ఏపీ మంత్రి నారా లోకేశ్‌ హాజరై క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు. మూడో రౌండ్‌ చివరి మ్యాచ్‌గా వల్లభనేని వెంకట్రావ్‌ యూత్‌, విక్కీ 11 జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌కు మంత్రి లోకేశ్‌ టాస్‌ వేశారు. అనంతరం సరదాగా ఆయన కాసేపు క్రికెట్‌ ఆడారు. దీనికి సంబంధించిన ఫొటోలను మంత్రి లోకేశ్‌ తన ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేయగా, అవి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయని, సరదాగా కాసేపు క్రికెట్‌ ఆడినట్లు లోకేశ్‌ పేర్కొన్నారు. అనంతరం మంగళగిరిలో నూతనంగా ఏర్పాటు చేసిన మగువ వస్త్ర దుకాణాన్ని మంత్రి లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా.. తన భార్య బ్రాహ్మణికి, తల్లి భువనేశ్వరి దేవికి మంత్రి చీరలు కొనుగోలు చేశారు. ఇదే క్రమంలో.. తన సొంత నిధులతో ఆధునికీకరించిన పీర్ల సావిడిని మంత్రి ప్రారంభించారు. ముస్లిం పెద్దలతో కలసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

అదేవిధంగా... రాష్ట్రంలో అధునాతన రైతు బజార్ త్వరలోనే నిర్మిస్తామని చెప్పిన లోకేష్.. దాదాపు 300 మంది రైతులు నేరుగా తాము పండించిన కూరగాయలను వచ్చి విక్రయించుకోవచ్చని పేర్కొన్నారు. మరోవైపు.. మంగళగిరి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున శ్మశానాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. గుంటూరు, విజయవాడతో పోల్చుకుంటే మంగళగిరిలో 25 శాతం ప్రజల పెరిగారని.. దానికి అనుగుణంగా వారికి కావాల్సిన సౌకర్యాలను కల్పిస్తామని అన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos