అమరావతి: లోకేష్ హామీ ఇస్తే నెరవేరినట్టే.. మంగళగిరి పేద ప్రజల కల నెరవేరబోతోంది. ఎంతో మంది నాయకులు హామీ ఇచ్చారు కానీ సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారం చేస్తూ నారా లోకేష్ అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న వారికి శాశ్వత హక్కు కల్పిస్తూ పట్టాలు అందజేసి మంగళగిరి పేద ప్రజల దశాబ్దాల కల నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 91,413 ఓట్ల భారీ మెజారిటీ తో మంగళగిరి ప్రజలు నారా లోకేష్ ను గెలిపించారు. గెలిచిన మొదటి రోజు నుండే నారా లోకేష్ ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసే దశగా కార్యాచరణ మొదలుపెట్టారు. ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా మిగిలిపోయిన సమస్యల పరిష్కారం కోసం పట్టుదలతో పనిచేస్తున్నారు. ఎన్నికల ముందు లోకేష్ ఇచ్చిన హామీల్లో ప్రధానమైంది ఇల్ల పట్టాల సమస్య. ఎన్నో ఏళ్లుగా పేద ప్రజలు ప్రభుత్వ భూముల్లో నివాసాలు ఏర్పాటు చేసుకొని నివసిస్తున్నారు. వారంతా తాము నివసిస్తున్న భూమిని, రెక్కల కష్టంతో నిర్మించుకున్న గూడుని క్రమబద్దీకరించాలని ఏళ్లుగా డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఎంతోమంది నాయకులు వారి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఎన్నికల్లో లబ్ది పొందినా ఆ హామీ అమలుకు కనీస కృషి చేసింది లేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది మంగళగిరి శాసనసభ్యుడిగా నారా లోకేష్ పేదల పట్ల తనకు ఉన్న చిత్తశుద్ధిని కార్యాచరణ లో పెట్టారు. గత పది నెలల్లో ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న ప్రజల వివరాల సేకరణ దగ్గర నుండి వివిధ శాఖల తో సమన్వయం, పేద ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులే ఇల్లకు వెళ్లి దరఖాస్తులు నింపడం వరకూ అన్నీ దశలను నారా లోకేష్ స్వయంగా పర్యవేక్షించారు. అత్యంత క్లిష్టమైన అటవీ భూములు, రైల్వే భూముల సమస్యను కూడా పట్టుదలగా తీసుకోని పరిష్కారం వైపు అడుగులు వేస్తున్నారు. మొదటి దశలో 3 వేల ఇల్ల పట్టాల పంపిణికి రంగం సిద్ధం చేసారు నారా లోకేష్. ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న వారి భూమిని, వారు నిర్మించుకున్న ఇంటిని క్రమబద్దీకరిస్తూ శాశ్వత హక్కు కల్పిస్తూ ఇంటి పట్టాలు అందజేయనున్నారు నారా లోకేష్. పట్టాల పంపిణితో పేదలకు భరోసా లభించనుంది. ఏప్రిల్ 3 న మొదటి పట్టాను ఉండవల్లి గ్రామంలో అందజేయనున్నారు. నారా లోకేష్ స్వయంగా లబ్ధిదారుల నివాసానికి వెళ్లి పట్టా అందజేసి మన ఇల్లు - మన లోకేష్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఏప్రిల్ 4 తేదీ నుండి మంగళగిరి డాన్ బాస్కో స్కూల్ ను అనుకోని ఉన్న ఖాళీ స్థలంలో ఏర్పాటు చేస్తున్న వేదిక పై లబ్ధిదారులకు నారా లోకేష్ ఇల్ల పట్టాలు అందజేయనున్నారు. ఏప్రిల్ 4 న యర్రబాలెం, నీరుకొండ, కాజా గ్రామాలకు చెందిన లబ్దిదారులకు నారా లోకేష్ ఇల్ల పట్టాలు అందజేయనున్నారు. ఏప్రిల్ 7 న పెనుమాక, ఉండవల్లి, ఇప్పటం, కొలనుకొండ,  పద్మశాలి బజార్ ప్రాంతాలకు చెందిన లబ్దిదారులకు పట్టాలు అందజేస్తారు, ఏప్రిల్ 8 న రత్నాల చెరువు, మహానాడు-2 కు చెందిన లబ్దిదారులకు పట్టాలు అందజేస్తారు, ఏప్రిల్ 11న సీతానగరం, సలాం సెంటర్, డ్రైవర్స్ కాలనీకు చెందిన లబ్దిదారులకు, ఏప్రిల్ 12 న మహానాడు-1, ఉండవల్లి సెంటర్ ప్రాంతాలకు చెందిన లబ్ధిదారులకు లోకేష్ పట్టాలు అందజేయనున్నారు. మొత్తంగా మూడువేలకు పైగా పట్టాల పంపిణి కి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల ముఖ్యనాయకులు, నారా లోకేష్ భారీ విజయానికి కృషి చేసిన ఆయా గ్రామాల, వార్డుల ముఖ్య నాయకులు పాల్గొననున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos