అమరావతి: రాష్ట్రంలో ఏర్పాటుకు అవసరమైన ఎకోసిస్టమ్ క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ చదువుకున్న యువతకు ఇక్కడే ఉద్యోగాలు కల్పించేందుకు కృషిచేస్తున్నాం. అయిదేళ్లలో 20లక్షల ఉద్యోగాల కల్పన దిశగా పనిచేస్తున్నాం, యువత బ్రెయిన్ గెయిన్ చేయడానికి అన్నిచర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. విజయవాడ పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి లోకేష్ విద్యార్థులతో ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు లోకేష్ ఆసక్తికరమైన సమాధానాలిచ్చారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి జక్రిరెడ్డి మాట్లాడుతూ...ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలు, దేశాలకు వెళ్లకుండా విద్యార్థుల బ్రెయిన్ డ్రెయిన్ కాకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. మంత్రి లోకేష్ సమాధానమిస్తూ... 62సంవత్సరాలు కలసికట్టుగా హైదరాబాద్ ను అభివృద్ధి చేసుకున్నాం. మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ తెచ్చేందుకు బాబుగారు ఎంతో కృషిచేశారు. 2014లో కట్టుబట్టలతో బయటకు వచ్చాం. ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణతో ముందుకు వెళ్లాం. ఒక్క కియావల్ల అనంతపురం తలసరి ఆదాయంలో 3వస్థానానికి చేరింది. చిత్తూరులో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు తెచ్చాం, ప్రకాశంలో బయో ఫ్యుయల్ రంగంలో పెట్టుబడులకు రిలయన్స్ ముందుకు వచ్చింది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రాజధాని ప్రాంతం అభివృద్ధి చెందుతోంది. ఉభయ గోదావరి ఆక్వా, డిఫెన్స్, పెట్రో కెమికల్స్, ఉత్తరాంధ్రలో కెమికల్, ఫార్మా, ఐటి అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్నట్లు చెప్పారు.

-షణ్ముక్, ఇంటర్ బైపిసి
కళాశాలలో కాంపౌండ్ వాల్ లేకపోవడం వల్ల అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం. కాలేజి సంరక్షణ ఇబ్బందిగా ఉంది. మీరు మా బంగారు భవిష్యత్తును నిర్మిస్తారని నమ్ముతున్నాం. కళాశాల పక్కనే బాలికల వసతి గృహం ఉంది. వరదల సమయంలో క్రిమికీటకాల వల్ల అక్కడి విద్యార్థినులు అనారోగ్యం బారిన పడుతున్నారు. మరోవైపు బాయ్స్ హాస్టల్ కూడా ఉంది. ఆ బిల్డింగ్ కూడా శిథిలావస్థలో ఉంది. అక్కడి విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. మేము మీ స్థాయికి చేరుకునేలా సహకారం అందించండి.

మంత్రి లోకేష్: మీరు నాకన్నా పెద్దస్థాయికి చేరాలన్నదే నా ఆకాంక్ష. ప్రధాని నరేంద్ర మోడీ, చంద్రబాబు నేతృత్వంలో భారత్ లో అద్భుతమైన అవకాశాలు వస్తున్నాయి. పెద్దఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి, షణ్ముక్ కోరిన విధంగా తప్సనిసరిగా కాంపౌండ్ వాల్, హాస్టళ్ల మరమ్మతులకు చర్యలు తీసుకుంటాం. రాష్ట్రంలో సోషల్ వెల్ఫేర్ హాస్టళ్ల మరమ్మతులు, అభివృద్ధికి 5వేల కోట్లు అవసరం, ఎలా సమీకరించాలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. కళాశాలలో వచ్చే విద్యాసంవత్సరం నాటికి అడిషనల్ క్లాస్ రూమ్స్, పెయింటింగ్స్, ప్లే గ్రౌండ్, ల్యాబ్స్, కాంపౌండ్ వాల్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం.

మయూరి, సెకండ్ ఇయర్, ఎంపిసి
సమాజంలో ప్రభుత్వ కాలేజి విద్యార్థులను చిన్నచూపు చూస్తారు, ప్రైవేటు కాలేజిలతో సమానంగా మమ్మల్ని చూడటానికి ఎటువంటి చర్యలు తీసుకుంటారు?
మంత్రి లోకేష్: ప్రైవేటురంగంలో జూనియర్ కాలేజిలు పిల్లలు కేటగిరైజ్ చేసి సబ్జెక్టువారీగా ఎక్సపర్ట్ లతో శిక్షణ ఇస్తున్నారు. ప్రభుత్వ కాలేజిల్లో కూడా కొచ్చన్ బ్యాంకు, మోడల్ పేపర్ల విధానాన్ని తెస్తున్నాం. విద్యార్థుల పనితీరును తెలుసుకునేలా తల్లిదండ్రుల వాట్సాప్ కు లింకు చేస్తాం. వివిధ సబ్జెక్టులో పెర్ఫార్పెన్స్ సప్లిమెంటేషన్ కోసం ఐఐటి మద్రాసుతో ఒప్పందం చేసుకున్నాం. పనిగంటలను గంటన్నర పెంచాం. కామన్ ఇన్ ఫ్రాస్ట్చర్ కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటుచేస్తున్నాం. వచ్చే విద్యాసంవత్సరానికి ఇవన్నీ పూర్తిచేస్తాం.

ఎం.రాజేష్, సీనియర్ ఎంపిసి
యువగళంలో 3వేలకు పైగా కి.మీ.ల పాదయాత్ర చేశారు, మీ ఫిట్ నెస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం, మీ ఇన్సిపిరేషన్ ఎవరు..?
లోకేష్: ఫిట్ నెస్ కన్నా సంకల్పం అవసరం. మార్పుకోసమే విద్యాశాఖను తీసుకున్నాను. రోడ్ లెస్ ట్రావెల్ చేసి కష్టతరమైన రహదారిని సులభతరం చేసుకోవాలి. జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే ఆ శక్తి మనకు వస్తుంది. నాకు ముగ్గురు వ్యక్తులు ఇన్సిఫిరేషన్... లిక్వానియో, సింగపూర్ ప్రధానిగా పనిచేశారు. మత్స్సకారులు ఉన్న చిన్న ప్రాంతాన్ని ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేశారు. మాజీ ప్రధాని వాజ్ పేయి గారు అందరి సమస్యల గురించి తెలుసుకుంటారు, మంచి ఐడియాలను ఇంప్లిమెంట్ చేస్తారు. చంద్రబాబుగారు క్రమశిక్షణకు మారుపేరు. 75సంవత్సరాల వయసులో అందిరకంటే స్పీడ్ గా పనిచేస్తారు. వారి ముగ్గురినుంచే నేను స్పూర్తి పొందాను. మీరు కూడా ఉన్నతమైన వ్యక్తులను రాజకీయాలకు అతీతంగా ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లండి.

షేక్ రేష్మా, సీనియర్ ఇంటర్ బైపిసి
మా కళాశాలలో 8సెక్షన్లు ఉన్నాయి, 4 క్లాస్ రూమ్స్ మాత్రమే ఉన్నాయి, మరో 4 క్లాస్ రూమ్ లు మంజూరు చేయండి.
లోకేష్: క్లాస్ రూమ్స్, పెయింటింగ్, ప్రహరిగోడ, ల్యాబ్స్ ఏర్పాటుకు కృషిచేస్తా. పాస్ పర్సంటేజి పెరిగితే మరిన్ని సౌకర్యాలు కల్పిస్తా. కష్టపడి చదివి మంచి పేరు తీసుకురండి.

కె.నీలిమ, ఎంపిసి, సెకండియర్
కళాశాలకు పెయింటింగ్ వేయించండి. ల్యాబ్ లు ఏర్పాటుచేయండి.
లోకేష్ : కళాశాలకు పెయింటింగ్ చేయిస్తా. పెయింట్స్ తోపాటు మిగతా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కల్పిస్తాం. పరీక్షలు పూర్తయ్యాక అడిషనల్ క్లాస్ రూమ్స్, ఇతర సౌకర్యాలు కల్పిస్తాం.

రమ్య సీనియర్ ఇంటర్, బైపిసి
రాత్రిపూట ఇబ్బంది కలగకుండా కాలేజి వెలుపల సిసి కెమెరాలు ఏర్పాటుచేయండి.
లోకేష్: రేపటికల్లా కెమెరాలు పెట్టిస్తాం, పోలీసుశాఖకు అనుసంధానిస్తాం.

వైష్ణవి, సీనియర్ ఇంటర్ సిఇసి
చాగంటి కోటేశ్వరరావు గారి ద్వారా నైతిక విలువల పెంపుదలకు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు?
లోకేష్: నేను ఇటీవల ఆయనను కలిశాను. పిల్లలకు ప్రత్యేకంగా ఒక బుక్ తయారుచేసి ఇవ్వాలని నిర్ణయించాం. ఏప్రిల్ నుంచి పూర్తిస్థాయిలో క్లస్టర్ యూనిట్ గా నేరుగా పిల్లలతో సమావేశమై చైతన్య పర్చేందుకు ఆయన సంసిద్ధత వ్యక్తంచేశారు. సమాజంలో మార్పురావాలంటే ముందుగా మహిళలు మాట్లాడాలి. మహిళలను అవమానకరంగా మాట్లాడే కొన్ని పద్ధతుల్లో మార్పు రావాలి. మార్పు మానుంచి, ఫిల్మ్ స్టార్స్ నుంచి, సమాజం నుంచి రావాలి.

పి.కేశవసాయి, సెకండియర్ ఎంపిసి
యువతను డ్రగ్స్ నుంచి బయటకు తీసుకురావడానికి మార్గాలు చెప్పండి.
మంత్రి సత్యకుమార్ : విద్యార్థులంతా దుర్వ్యసనానికి దూరంగా ఉండండి, ఎవరైనా డ్రగ్స్ బారిన పడితే టోల్ ఫ్రీ నెంబర్ కు చెప్పండి. డీ ఎడిక్షన్ సెంటర్లు పెడుతున్నాం. యువతను డ్రగ్స్ బారిన పడకుండా టాస్క్ ఫోర్స్ ఏర్పాటుచేశాం. మీరంతా దూరంగా ఉండటంతోపాటు మిత్రులు కూడా వాటి బారిన పడకుండా కాపాడుకోవాలి అని అన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos