ఏపీ మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సెప్టెంబర్ 5వ తేదీ ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. ఈ భేటీ కోసం మంత్రి లోకేశ్ ఈరోజు రాత్రే ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ప్రధాని మోదీతో మంత్రి లోకేశ్‌ జరపనున్న ఈ సమావేశం పూర్తిగా మర్యాదపూర్వక భేటీ అని అధికారిక వర్గాలు వెల్లడించాయి.

ఢిల్లీలో ప్రధానితో సమావేశం ముగిసిన వెంటనే మంత్రి లోకేశ్‌ తిరిగి రాష్ట్రానికి పయనం కానున్నారు. రేపు మధ్యాహ్నానికల్లా ఆయన రాష్ట్రానికి చేరుకుంటారని సమాచారం. అనంతరం ఆయన నేరుగా అమరావతిలో జరగనున్న ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు.  కాగా జీఎస్టీలో భాగంగా ఇప్పటివరకు ఉన్న నాలుగు శ్లాబులను రెండుకు కుదించడం, నిత్యావసరాలపై పన్ను రేట్లను తగ్గించడం వంటివి వృద్ధికి దోహదపడే సానుకూల నిర్ణయాలని మంత్రి లోకేశ్‌ పేర్కొన్నారు. ఈ సంస్కరణలు దేశ పన్నుల విధానాన్ని మరింత సరళతరం చేస్తాయని ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ఆయన కొనియాడారు.

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యంగా పెన్సిళ్లు, షార్ప్‌నర్‌లు, వ్యాయామ పుస్తకాలు (ఎక్సర్‌సైజ్ బుక్స్), మ్యాపులు, చార్టుల వంటి వాటిపై జీఎస్టీ తగ్గించడాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ నిర్ణయం విద్యార్థుల తల్లిదండ్రులకు ఎంతో ఊరటనిస్తుందని అన్నారు. ఇలాంటి చర్యలు విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించడానికి ఎంతగానో ఉపయోగపడతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. సరళమైన, వృద్ధికి అనుకూలమైన పన్నుల విధానాన్ని తీసుకొచ్చినందుకు ప్రధాని మోదీని ఆయన ప్రశంసించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos