మంగళగిరి: కష్టాల్లో ఉన్న వారికి నేనున్నానంటూ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భరోసా ఇస్తున్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో 87వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలపై పార్టీ కార్యాలయానికి తరలివచ్చిన సామాన్యులు, పార్టీ కార్యకర్తలను మంత్రి ఆప్యాయంగా పలకరించారు. వివిధ సమస్యలపై వారి నుంచి వినతులు స్వీకరించారు. సౌత్ కోస్ట్ రైల్వే ఏర్పాటు నేపథ్యంలో విజయవాడలోని లోకో పైలట్ల గాలా(సికింద్రాబాద్) డిపోను తరలించకుండా విజయవాడలోనే కొనసాగించేలా తగిన చర్యలు తీసుకోవాలని సిబ్బంది మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. విజయవాడ బోర్డును కొండపల్లి నుంచి మోటమర్రికి పెంచడం వల్ల గత 17 ఏళ్లుగా విజయవాడలో ఉన్న సికింద్రాబాద్(గాలా) డిపో ఉనికి సందిగ్ధంలో పడిందని, డిపోను మోటమర్రికి లేగా డోర్నకల్ కు తరలిస్తారనే ప్రచారంతో సుమారు 500 కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో గత 20 ఏళ్లుగా పనిచేస్తున్న దినసరి వేతన ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ఆల్ యూనివర్సిటీస్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ దినసరి ఉద్యోగుల కమిటీ ప్రతినిధులు మంత్రి నారా లోకేష ను కలిసి కోరారు. కోవిడ్ వల్ల నష్టపోయిన హైర్ బస్ యజమానుల బస్సులకు రీప్లేస్ మెంట్ కల్పించి ఆదుకోవాలని ఏపీ హైర్ బస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. నంద్యాల జిల్లా మహానంది మండలం గాజులపల్లె గ్రామంలో తమకు వంశపారంపర్యంగా సంక్రమించిన 2.63 ఎకరాల భూమిని శిరిగిరి చంద్రమౌళీశ్వర రెడ్డి ఆక్రమించారని, విచారించి తగిన న్యాయం చేయాలని కర్నూలు జిల్లా గుండంపాడుకు చెందిన ఎస్.చిన్న శివమ్మ మంత్రి నారా లోకేష్ ను కలిసి కోరారు. ఆయా వినతులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos