ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా రాజధాని గ్రామాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రకటించారు. అమరావతి పరిధిలోని అనంతవరం, నెక్కల్లు గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, సీఆర్డీఏ అధికారులతో కలిసి ఈరోజు నిర్వహించిన గ్రామసభల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్థుల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి, మౌలిక సదుపాయాల కల్పనపై స్పష్టమైన హామీ ఇచ్చారు.

రాజధాని మాస్టర్ ప్లాన్‌లో భాగంగా గ్రామ కంఠాల బయట ఏ తరహా అత్యాధునిక సౌకర్యాలు ఉంటాయో, గ్రామాల్లో కూడా అదే స్థాయిలో అభివృద్ధి చేస్తామని మంత్రి వివరించారు. ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, స్టార్మ్ వాటర్ వ్యవస్థ, ఎల్‌ఈడీ వీధి దీపాలు, నాణ్యమైన సిమెంట్ రోడ్ల నిర్మాణం చేపడతామని... పనులు ప్రారంభించిన ఆరు నెలల్లోనే పూర్తి చేస్తామని వెల్లడించారు. ప్రస్తుతం రాజధాని నిర్మాణ పనుల్లో సుమారు 30,000 మంది కార్మికులు నిరంతరం శ్రమిస్తున్నారని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాజధాని నిర్మాణ గడువులపై కూడా నారాయణ కీలక వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది జూన్ నాటికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారుల నివాస భవనాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అలాగే, 2027 జూన్ నాటికి 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు, 1,500 కిలోమీటర్ల లేఅవుట్ రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఇక అమరావతికి తలమానికంగా నిలిచే ఐకానిక్ భవనాలు 2028 డిసెంబర్ నాటికి పూర్తవుతాయని మంత్రి నారాయణ వివరించారు. నిన్ననే ఉండవల్లి వద్ద స్టీల్ బ్రిడ్జ్ పనులను పరిశీలించిన మంత్రి, నేడు నేరుగా గ్రామాల్లో పర్యటించి ప్రజలకు భరోసా కల్పించడం విశేషం.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos