వాలంటీర్ల కొనసాగింపు పైన ప్రభుత్వం తన వైఖరి స్పష్టం చేసింది. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లను కొనసాగించటంతో పాటుగా వారికి రూ 10 వేలు చొప్పున చెల్లిస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు వాలంటీర్ల కొనసాగింపు పైన స్పష్టత ఇవ్వలేదు. మంత్రివర్గ సమావేశాల్లో చర్చకు వచ్చినా నిర్ణయం తీసుకోలేదు. ఇదే సమయంలో వాలంటీర్లు తమను విధుల్లోకి తీసుకోవాలంటూ నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ సమయంలోనే మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి వాలంటీర్ల కొనసాగింపు పైన శాసనమండలి వేదికగా స్పష్టత ఇచ్చారు.

ఏపీ శాసనమండలిలో వాలంటీర్ల వేతనాల అంశం పైన చర్చకు వచ్చింది. స్పందించిన మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అసలు ప్రస్తుతం వాలంటీర్ వ్యవస్థ అమల్లో లేదన్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనే 2023 ఆగస్టు తరువాత వాలంటీర్లు రెన్యువల్ కాలేదని.. ఈ మేరకు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని మంత్రి స్పష్టం చేసారు. అసలు అమల్లోనే లేని వాలంటీర్ల వ్యవస్థకు జీతాలు ఎలా చెల్లిస్తామని ప్రశ్నించారు. అమలులోనే లేని వాలంటీర్లు ఎలా రాజీనామాలు చేస్తారని మంత్రి వ్యాఖ్యానించారు. వాలంటీర్ల రెన్యువల్ పైన నిర్ణయం తీసుకోని వైసీపీ ప్రభుత్వం నాడు వాలంటీర్లను.. ప్రజలను మోసం చేసిందని మంత్రి ఆరోపించారు.

దీనికి శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స స్పందిస్తూ రెన్యువల్ జీవో ఇవ్వచ్చు కదా అంటూ నిలదీసారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వాలంటీర్లను కొనసాగించి వారికి రూ 10 వేలు చొప్పున చెల్లించాలని డిమాండ్ చేయడంతో... లేని వాలంటీర్ల వ్యవస్థకు జీతాలు పెంచటం ఎలా సాధ్యమని మంత్రి వ్యాఖ్యానించారు. దీని పైన వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు. కొద్ది రోజుల క్రితం సర్పంచ్ ల సంఘం నేతలు డిప్యూటీ సీఎం పవన్ ను కలిసి వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలని కోరగా ...దీని పైన పవన్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

వాలంటీర్లు ఉద్యోగంలో ఉంటే రద్దు చేయొచ్చు.. కానీ వాళ్లు అసలు వ్యవస్థలోనే లేరు.. ఇదో సాంకేతిక సమస్య అంటూ పవన్ తేల్చి చెప్పారు. వాలంటీర్లకు మేలు చేయాలనే ఆలోచలతోనే కూటమి ప్రభుత్వం ఉందని చెప్పారు. దీంతో, ప్రభుత్వం కొత్తగా వాలంటీర్ల వ్యవస్థ పైన కొత్తగా నిర్ణయం తీసుకోవాల్సి ఉందనే అంశం స్పష్టం అవుతోంది. అయితే, గతంలో ఉన్న సంఖ్యలో కాకుండా.. పరిమిత సంఖ్యలో అవసరమైన విధంగా వారి సేవలను వినియోగించుకోవాలనే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. ఏం జరుగుతుందో మరి చూడాలి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos