ఏపీలో మద్యానికి సంబంధించి మంత్రి కొల్లు రవీంద్ర కీలక ప్రకటన చేశారు. జాతీయ స్థాయిలో పేరొందిన కంపెనీలతో కూడా రూ.99కే మద్యం అమ్మించాలని ప్రయత్నం చేస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.99 మద్యానికి మంచి ఆదరణ వస్తోందని.. ఇప్పటివరకు 5 లక్షల కేస్ లకు పైగా విక్రయాలు జరిగాయని అన్నారు. జాతీయ స్థాయిలో పేరొందిన సంస్థలు సైతం ఈ మద్యం అమ్మకాలు ఎలా ఉన్నాయో చూస్తున్నట్లు తెలిపారు. అవి కూడా ఉత్పత్తి సామర్థ్యం పెంచుకుని ఆ తర్వాత నాణ్యమైన మద్యం సరఫరా చేస్తాయన్నారు. ఇప్పటికే పలు కంపెనీలతో సంప్రదింపులు జరిపినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం మద్యం షాపుల్ని పెంచలేదని... గత ఐదేళ్లలో కల్తీ మద్యం తాగి ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్నారని.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పారదర్శకంగా మద్యం షాపుల్ని కేటాయించామని.. నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తెచ్చామని మంత్రి రవీంద్ర అన్నారు. తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ప్రభుత్వానికి రూ.1,800 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు. గత ప్రభుత్వంలో రూ.1,800 కోట్ల అవినీతి జరిగిందని.. గత ప్రభుత్వంలో రాష్ట్రంలో ఇంటర్నేషనల్ బ్రాండ్లు సైతం అమ్మకాలు పూర్తిగా ఆగిపోయాయన్నారు.తాము రూ.99కే నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తెచ్చామని... కొత్త మద్యం విధానాన్ని తీసుకొచ్చి మద్యం ధర తగ్గించామని మంత్రి అన్నారు. గత ప్రభుత్వ మద్యం అక్రమాలపై సీఐడీ విచారణ జరుపుతామని, అక్రమార్కుల అందరిపైనా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

రూ.99కే చీప్ లిక్కర్‌ను అన్ని చోట్లా అందుబాటులో తీసుకొస్తామన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. పొరుగు రాష్ట్రం కంటే ఏపీలో ధర తక్కువే ఉండేలా.. టెండర్ కమిటీ ద్వారా మద్యం రేట్లను నిర్ణయిస్తామని తెలిపారు. గతంలో ఉన్న ఉన్న 3396 షాపులకే టెండర్లు పిలిచి లాటరీలో కేటాయించామని.. వీటిలో 10 శాతం కల్లుగీత కార్మికులకు కేటాయించినట్లు చెప్పారు. పారదర్శకంగా మద్యం షాపులు కేటాయించామని.. లాటరీల ద్వారా మద్యం షాపులు కేటాయించడంతో వైఎస్సార్సీపీ వారికి కూడా మద్యం షాపులు దక్కాయన్నారు. అలాగే బెల్టు షాపులపై చర్యలు తప్పవని హెచ్చరించారు మంత్రి కొల్లు రవీంద్ర.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos