ఏపీ : ధర్మవరం పట్టణాన్ని అభివృద్ధి బాటలో నడిపేందుకు అధికారులు కౌన్సిలర్ల సహాయంతో ముందుకు వెళ్తామని ధర్మవరం ఎమ్మెల్యే, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ లో జరుగు కౌన్సిల్ సమావేశానికి వారు ముఖ్య అతిథిగా మొట్టమొదటిసారి హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ అభివృద్ధి దిశలో తీసుకొని అంశంలో భాగంగా 53 అంశాలపై కౌన్సిలర్లతో చైర్మన్ లక్ష్మి ఆధ్వర్యంలో చర్చించడం జరిగింది. కౌన్సిలర్లు అందరూ కూడా 53 అంశాలపై తమ ఆమోదమును తెలిపారు. అనంతరం కౌన్సిలర్లు చందమూరి నారాయణరెడ్డి, మాసపల్లి సాయికుమార్, రామకృష్ణ, బ్రహ్మయ్య, తదితర కౌన్సిలర్లు పట్టణములో నెలకొన్న సమస్యలను వారు చైర్మన్ తో పాటు మంత్రి దృష్టికి తీసుకొని వచ్చారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ పట్టణంలో వీధి దీపాల వీధి దీపాల సమస్య, సమాధుల సమస్య, మున్సిపల్ ఆఫీసుకు వచ్చే కరెంటు బిల్లు సమస్య, ధర్మవరం టు చిన్నూరుకు వెళ్లేందుకు బ్రిడ్జ్ ఏర్పాటు, డ్రైనేజీ సమస్య, కాలువలను సైజు పెంచే సమస్య, చెత్తను తొలగించేందుకు వచ్చే ఆటోలు సరిగా రావడం లేదని, పురపాలక సంఘానికి రావలసిన టౌన్ ప్లానింగ్ నిధులు సొంత నిధులకు వెళుతున్నాయని టౌన్ ప్లానింగ్ అధికారుల యొక్క అవినీతి అధికంగా ఉందని,తదితర సమస్యలన్నీ కూడా కౌన్సిల్స్ కౌన్సిల్ దృష్టికి తీసుకుని వచ్చారు. అనంతరం మంత్రి సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ పట్టణంలో ఉన్నటువంటి సమస్యలన్నింటిని కూడా సామరస్యంతో కౌన్సిలర్లు యొక్క సలహా సూచనలతో సమన్వయంతో పట్టణ అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. అవసరమైతే కేంద్ర ,రాష్ట్ర నిధులతో ధర్మావరాన్ని ఉత్తమ పట్టణంగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. పట్టణ అభివృద్ధికి సహకరించాల్సిన బాధ్యత  కౌన్సిలర్లు, అధికారులు దేనిని తెలిపారు. తదుపరి టౌన్ ప్లానింగ్ విషయంలో అవినీతి విషయం జరుగుతున్నది వాస్తవమేనని, దీనిపై సంబంధిత అధికారులపై తక్షణమే విచారణ జరిపి చర్యలు గైకొంటామని వారు హామీ ఇచ్చారు. పట్టణ అభివృద్ధిలో అన్ని సమస్యలను పరిష్కరించే విధంగా అధికారులు, మున్సిపల్ కమిషనర్ తమ విధులను బాధ్యతగా సేవాభావంతో చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని వారు తెలిపారు. ఎక్కడ ఎటువంటి సమస్యలు పరిష్కరించకపోతే సంబంధిత అధికారులు సిబ్బంది మీద కఠిన చర్యలు తప్పక తీసుకోవడం జరుగుతుందని వారు తెలిపారు. తొలుత మున్సిపల్ కార్యాలయానికి నూతనంగా వచ్చిన ఉద్యోగులను పరిచయం చేసుకున్నారు. పట్టణంలో చెత్త విషయంలో మాత్రం ప్రతి ఒక్కరు సమన్వయంతో పని చేస్తూ ఆపరిశుభ్రత లేకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని తెలిపారు. పట్టణ సమస్యలకు నూతన కమిషనర్ ప్రమోద్ కుమార్ కూడా సమాధానమిస్తూ, అన్ని సమస్యలు పరిష్కరించే విధంగా తాను కృషి చేస్తానని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి, చైర్ పర్సన్ తో పాటు మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్, ఆర్వో, మేనేజ

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos