ఏపీ విద్యామంత్రిగా నారా లోకేశ్ కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఆయన మంత్రి అయ్యాక విద్యా శాఖలో విప్లవాత్మక చర్యలు తీసుకుంటున్నారు. మెగా పేరెంట్ టీచర్ మీటింగుతో మొదలుపెట్టిన సంస్కరణలు ఇప్పుడు నెక్ట్స్ లెవెల్ కు తీసుకువెళుతున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులకు అధునాతన విద్యా విధానాలపై అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా విద్యార్థులను ఢిల్లీకి పంపారు. అదేవిధంగా ఉపాధ్యాయులను సింగపూర్ పర్యటనకు పంపనున్నారు.

ప్రభుత్వ బడుల్లో చదువుకుంటున్న ప్రతిభావంతులైన విద్యార్థులను విమానంలో ఢిల్లీకి పంపాలని మంత్రి లోకేశ్ తీసుకున్న నిర్ణయంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. బస్సుల్లో స్కూలుకు వెళ్లడమే గొప్పగా భావిస్తున్న రోజుల్లో విద్యార్థులను విమానాల్లో విజ్ఞాన విహార యాత్రకు పంపడం విశేషంగానే చెబుతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 52 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. బుధవారం వీరంతా విజయవాడ విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. మూడు రోజుల ఈ పర్యటనలో విద్యార్థులకు ప్రముఖ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ నిపుణులతో అవగాహన కల్పిస్తారు. ఢిల్లీ వెళ్లిన విద్యార్థులు మూడు రోజుల అనంతరం  ప్రధానమంత్రి సంగ్రహాలయను సందర్శించి భారత నాయకత్వం, టెక్నాలజీ, సైంటిఫిక్ విజన్ అంశాల గురించి తెలుసుకుంటారు. విద్యార్థులకు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు. క్షేమంగా వెళ్లి విజ్ఞానంతో తిరిగి రావాలని ట్వీట్ చేశారు.

ఇదే సమయంలో మంత్రి లోకేశ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. విదేశాల్లో విద్యాబోధనపై మన ఉపాధ్యాయులకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ఇందుకోసం రాష్ట్రంలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 78 మందిని సింగపూర్ పర్యటనకు పంపుతున్నారు. ఈ నెల 27న నుంచి వచ్చే నెల 2వ తేదీవరకు ఈ ఉపాధ్యాయులు సింగపూర్ లో పర్యటిస్తారు. అక్కడి పాఠశాలలు, బోధన పద్ధతులు, తరగతి వాతావరణంపై అధ్యయనం చేసి రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుకు నివేదిక సమర్పించాలని సూచించారు. అదేవిధంగా ఈ నెల 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా స్టూడెంట్ అసెంబ్లీ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos