ఆంధ్రప్రదేశ్‌కు మరో కీలకమైన పరిశ్రమ వచ్చే అవకాశం ఉంది. ప్రకాశం జిల్లాలోని దొనకొండ సమీపంలో ఏర్పాటు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఆదివారం DRDO బృందం ఏపీఐఐసీకి చెందిన భూములను పరిశీలించింది. రక్షణ రంగ పరిశ్రమల ఏర్పాటు కోసం భూమిని పరిశీలించడానికి DRDO ప్రతినిధులు వచ్చారని చెబుతున్నారు. ఢిల్లీ, బెంగళూరుకు చెందిన DRDO ప్రతినిధులు 100 ఎకరాల భూమి అవసరమని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే దొనకొండలోని బ్రిటిష్ కాలం నాటి విమానాశ్రయం భూముల్ని కూడా పరిశీలించారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే నీరు సమృద్ధిగా ఉంటుందని.. రవాణా మార్గం కూడా అందుబాటులో ఉంటుందని అధికారులు DRDO బృందానికి వివరించారు. రక్షణ పరికరాల తయారీకి ఇక్కడ అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందన్నారు. ఆ భూముల వివరాలు, సరిహద్దులు వివరించారు.

దొనకొండ సమీపంలో క్షిపణి తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే DRDO ప్రతినిధుల బృందం దొనకొండలో పర్యటించినట్లు సమాచారం. ఆపరేషన్ సిందూర్‌ తరువాత బ్రహ్మోస్ క్షిపణుల తయారీని పెంచాలని కేంద్రం భావిస్తున్నందున ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దొనకొండలో ఉన్న బ్రిటిష్ కాలంనాటి విమానాశ్రయం గురించి కూడా DRDO బృందం ఆరా తీసింది. విమానాశ్రయం ఎంత పెద్దది, అప్పట్లో రన్‌వే ఎలా ఉండేది వంటి విషయాలను ఆరా తీశారు. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

వాస్తవానికి రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి కొత్త రాజధాని ఏర్పాటుపై ప్రతిపాదనలు వచ్చిన సమయంలో.. ప్రకాశం జిల్లా దొనకొండ ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేస్తే బావుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే అప్పటి టీడీపీ ప్రభుత్వం అమరావతివైపు మొగ్గు చూపింది. దొనకొండను పరిశ్రమలకు హబ్‌గా తయారు చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ దిశగా అడుగులుపడుతున్నాయనే చర్చ జరుగుతోంది.. త్వరలోనే మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే దొనకొండకు సమీపంలోని కనిగిరి దగ్గర రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్‌లు ఏర్పాటు చేసేందుకు శంకుస్థాపన కూడా ఏర్పాటు చేశారు. మొత్తానికి భవిష్యత్తులో దొనకొండ పరిశ్రమల హబ్ గా మారనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos