ఏపీ రాజకీయాల్లో కీలక సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వంలో మెగా బ్రదర్ నాగబాబు మంత్రి అవ్వటం ఖాయమని భావిస్తున్న వేళ భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కోటాలో కూటమి నుంచి అయిదుగురు ఎమ్మెల్సీల ఖరారు దాదాపు కొలిక్కి వచ్చింది. నాగబాబుకు మంత్రి పదవి లేనట్లుగానే కనిపిస్తోంది. ఇదే సమయంలో పిఠాపురంలో పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మకు పదవి పైన చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కూటమిలో పదవుల వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది.

జనసేన నుంచి నాగబాబుకు ఖాయమని ఇప్పటి వరకు అందరూ భావించారు. అనూహ్యంగా నాగబాబు ఎమ్మెల్సీ రేసు నుంచి తప్పుకున్నారు. ఆయనను మంత్రివర్గంలోకి తీసుకుంటామని రాజ్యసభ అభ్యర్ధుల ఖరారు వేళ చంద్రబాబు వెల్లడించారు. ఇప్పుడు నాగబాబుకు ఇక ఆ అవకాశం లేదనే చర్చ జరుగుతోంది. దీంతో, నాగబాబుకు అసలు ఏ పదవి దక్కుతుందనేది సస్పెన్స్ పెంచుతోంది. ఇక, అయిదు స్థానాలకు ఎమ్మెల్సీల ఎంపిక ఒక కొలిక్కి వచ్చినట్లు సమాచారం.

కూటమికి దక్కే అయిదు స్థానాల్లో జనసేన - బీజేపీ ఒక్కో స్థానం కోరుతున్నాయి. చంద్రబాబుతో పవన్ ఇదే అంశం పైన చర్చించారు. నాగబాబు రేసు నుంచి తప్పుకోవటంతో జనసేనకు ఛాన్స్ లేదని చెబుతున్నారు. బీజేపీకి ఒక సీటు దక్కనుంది. టీడీపీకి దక్కే నాలుగు స్థానాల్లో పిఠాపురం నుంచి గత ఎన్నికల్లో పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మకు ఎమ్మెల్సీ సీటు ఖాయమైనట్లు విశ్వసనీయ సమాచారం. అదే విధంగా సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ మిగిలిన సీట్ల విషయంలో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్న ఆశావహులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. బీసీ, మైనార్టీ, ఎస్సీ వర్గాలకు మూడు స్థానాలు దక్కుతాయని తెలుస్తోంది. దీంతో.. మైనార్టీ కోటాలో కేఎం సైఫుల్లా, మహ్మద్ నజీర్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

బీసీ కోటాలో బీద రవిచంద్ర, బుద్దా వెంకన్న పోటీలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌, మండలి మాజీ డిప్యూటీ చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం, మాజీ ఎంపీ ఏరాసు ప్రతాపరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి, ప్రస్తుతం రిటైరవుతున్న ఎమ్మెల్సీలు బీటీ నాయుడు, దువ్వారపు రామారావు, పర్చూరి అశోక్‌బాబు ఉన్నారు. దేవినేని ఉమాకు అవకాశం ఇచ్చే అంశం పైనా చర్చ జరుగుతోంది. ఎన్నికలకు ముందు వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న జంగా కృష్ణమూర్తి రాజీనామా చేసారు. చంద్రబాబు హామీ మేరకు ఇప్పుడు ఆయనకు పదవి ఖాయమని భావిస్తున్నారు. దీంతో.. చివరికి ఈ మూడు స్థానాలు ఎవరికి దక్కుతాయనేది కూటమిలో ఉత్కంఠగా మారుతోంది. ఏం జరుగుతుందో మరి చూడాలి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos