విజయవాడ: దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఆశయాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని వివిధ డివిజన్లలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకల్లో  ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా, 40వ డివిజన్ టిడిపి అధ్యక్షుడు పి.వి. సుబ్బయ్య ఆధ్వర్యంలో కనకదుర్గ ఫ్లైఓవర్ వద్ద ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే  సుజనా చౌదరి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తన రాజకీయ జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని తెలిపారు. ఎన్టీఆర్ రాజకీయాలలోని క్రమశిక్షణ, పట్టుదల వలన అతి తక్కువ సమయంలో ప్రతిష్టాత్మక స్థాయికి చేరుకున్నారని, రాజకీయాలు ప్రజాసేవ కోసం మాత్రమే ఉండాలని ఆయన నిరూపించారని సుజనా చౌదరి చెప్పారు. ప్రతి ఒక్కరు ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ, ప్రజల అభ్యున్నతిని లక్ష్యంగా నిరంతరం కృషి చేయాలని ఆయన పిలుపు ఇచ్చారు.

 

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos