ఏపీలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన వైసీపీ నేతలు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. ప్రజల సమస్యలపై స్పందించడం మాట అటు ఉంచితే ... కనీసం పార్టీ కార్యకర్తలకు కూడా అందుబాటులో లేకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ భరత్ విషయం ఆ పార్టీలోని కార్యకర్తల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

అధికారంలో ఉన్నప్పుడు కుప్పంలో పెద్దిరెడ్డి, భరత్ కలిసి చేయని అరాచకం లేదు. భరత్ ను ముందు పెట్టి పెద్దిరెడ్డి అక్కడి వనరుల్ని కొల్లగొట్టి రౌడీయిజాన్ని పెంచి.. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశారు. చంద్రబాబును ఓడిస్తానని సవాల్ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో వారు చేసిన నిర్వాకాలు.. ఆ తర్వాత చేసిన పనుల కారణంగా ఇప్పుడు ఎవరూ కుప్పంలో బతకలేని పరిస్థితి వచ్చింది. పార్టీ ఓడిపోయిన వెంటనే సగం మంది క్యాడర్ పారిపోతే.. సగం మంది టీడీపీకి లొంగిపోయారు. పారిపోయిన వారిలో ఇన్ చార్జ్ భరత్ కూడా ఉన్నారు.

హైదరాబాద్‌లో శాశ్వత నివాసం ఉండే భరత్ … వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తనదే రాజ్యమన్నట్లుగా చెలరేగిపోయారు. అరాచకశక్తులకు ప్రాధాన్యం ఇచ్చారు. పోలీసుల్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నేతల్ని ఎంతలా వేధించాలో అంతగా వేధించారు. చంద్రబాబు పర్యటనకు వస్తే రాళ్లు వేశారు. చంద్రబాబు టూర్ కు వస్తే బాంబులేస్తానని ప్రకటించారు. ఇంత చేసిన తరవాత తాము నియోజకవర్గంలో ఉంటే కష్టమని పారిపోయారు.

విచిత్రం ఏమిటంటే.. ఏవేవో మాయ మాటలు చెప్పి అందర్నీ రెచ్చగొట్టిన పెద్దిరెడ్డి అసలు పట్టించుకోవడం లేదు. అండగా ఉండాల్సిన భరత్ అసలు కుప్పం వైపు రావడం లేదు. వారే రాకపోతే ఇక మిగిలిన వారికి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది. అందుకే భరత్ కనిపించడం లేదని వారే కోపంతో నియోజకవర్గంలో పోస్టర్లు వేస్తున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos